Begin typing your search above and press return to search.
బ్రహ్మచారికి.. ఫుడ్ పాయిజనింగ్ కు లింక్!
By: Tupaki Desk | 13 April 2019 4:54 PM GMTయంగ్ హీరో నితిన్ ఈమధ్య తన పుట్టిన రోజు సందర్భంగా మూడు సినిమాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఒక చిత్రం.. కృష్ణ చైతన్య డైరెక్షన్ లో 'పవర్ పేట'.. వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ'.. ఇలా మూడు సినిమాలను ప్రకటించాడు. ఇదిలా ఉంటే వెంకీ కుడుముల సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది.
'భీష్మ' అనే టైటిల్ 'సింగిల్ ఫరెవర్ అనే క్యాప్షన్ చూడగానే పెళ్ళికి ఆమడ దూరంగా బ్యాచిలర్ గా ఉండే హీరో క్యారక్టరైజేషన్ అని మనం ఫిక్స్ అయిపోవచ్చు. మరి సల్మాన్ ఖాన్ టైపు బ్రహ్మచర్యమా లేక మహాభారతంలోని భీష్ముడి తరహా ఘోటక బ్రహ్మచర్యమా అనేది మనకు సినిమా చూస్తే కానీ క్లారిటీ రాదు. అయితే ఇది సినిమాకు మెయిన్ థీమ్.. 'భీష్మ' లో మరో ఇంట్రెస్టింగ్ సబ్ ప్లాట్ ఉండేలా దర్శకుడు వెంకీ స్క్రిప్ట్ ను తీర్చిదిద్దాడట. ప్రస్తుతం మన సమాజంలో జరుగుతన్న ఫుడ్ పాయిజనింగ్ ఇష్యూను వెంకీ వివరంగానే చర్చించాడట.
జస్ట్ బ్రహ్మచారి కాన్సెప్ట్ అంటే రొటీన్ గా ఉంటుందని అనుకున్నాడేమో గానీ.. ఫుడ్ పాయిజన్ చేసి సినిమాకు కాస్త సీరియస్ నెస్ ఉండేలా సెట్ చేస్తున్నాడు. నిజంగానే ఈ ఇష్యూను సినిమాల్లో పెద్దగా ఎవరూ టచ్ చేయలేదు. సరిగ్గా వాడుకుంటే ఈ సినిమాకు సబ్ ప్లాట్ ప్లస్ అయ్యే అవకాశం ఉంది. వెంకీ కుడుముల మొదటి సినిమా 'ఛలో' ఒక లవ్ ఎంటర్టైనర్. రెండో సినిమాకు సోషల్ మెసేజ్ టచ్ ఉండేలా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకోవడం గొప్ప విషయం. అంటే దర్శకుడికి రొటీన్ గా వెళ్ళే ఆలోచన లేదన్నమాట.