Begin typing your search above and press return to search.
వరల్డ్ కప్ కోసం పెద్దోడు చిన్నోడు
By: Tupaki Desk | 15 May 2019 7:56 AM GMTటాలీవుడ్ లో క్రికెట్ అంటే అమితంగా ఇష్టపడే వాళ్ళు ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు విక్టరీ వెంకటేష్. ఇండియా కానీ సన్ రైజర్స్ కాని మ్యాచులు ఎప్పుడు ఎక్కడ జరిగినా అక్కడ తన అటెండెన్స్ ఉండేలా చూసుకుంటారు వెంకీ. మహేష్ బాబుకి సైతం ఇష్టమే కానీ దాన్ని ఇలా ప్రదర్శించడం చాలా తక్కువ.
మహర్షి ప్రీ రిలీజ్ లో కూడా దీని సక్సెస్ ని వరల్డ్ కప్ ఫైనల్ గా ధోని సిక్స్ తో పోల్చి ఆట మీద ఇష్టాన్ని చూపించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చేసారు. సినిమాలో పాత్ర పేర్లు పెద్దొడు చిన్నోడుగా జనంలో బాగా రిజిస్టర్ అయిపోయాయి.
ఇప్పుడు త్వరలో యుకెలో ప్రారంభం కానున్న ప్రపంచ కప్ కోసం ఇండియా మ్యాచులు చూసేందుకు ఇద్దరూ వెళ్లనున్నట్టు తెలిసింది. నిర్మాత సురేష్ బాబు కూడా ఈ బృందంలో ఉంటారట. ఇండియా ఆడే లీగ్ మ్యాచులు చూసి సెమీస్ చేరితే కనక టూరును కొనసాగిస్తారు. దానికి అనుగుణంగా వెంకటేష్ తన వెంకీ మామ షెడ్యూల్ ను ప్లాన్ చేసుకున్నారట.
ఎలాగూ మహేష్ ఇప్పుడు రిలాక్స్ అవుతున్నాడు. అనిల్ రావిపూడి సినిమా మొదలుపెట్టడానికి కొంత టైం ఉంది కాబట్టి హ్యాపీగా మ్యాచులు ఎంజాయ్ చేయొచ్చు. సో త్వరలో క్రికెట్ గ్రౌండ్ లో చిన్నోడు పెద్దోడు కలిసి ఇండియా టీమ్ కి జోష్ ఇవ్వడాన్ని చూసుకోవచ్చు