Begin typing your search above and press return to search.

అఖిల్ థర్డ్ పై మరో మాట

By:  Tupaki Desk   |   23 Feb 2018 8:55 AM GMT
అఖిల్ థర్డ్ పై మరో మాట
X
అక్కినేని అఖిల్ నటించిన సెకండ్ మూవీ హలో.. అతని ఆశలను తీర్చలేకపోయింది. ప్రాజెక్టు పరంగా మంచి వసూళ్లనే రాబట్టగలిగినా.. సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చినా.. బ్రేక్ ఈవెన్ మాత్రం సాధ్యం కాకపోవడంతో.. కమర్షియల్ గా సక్సెస్ అనిపించుకోలేకపోయింది. అందుకే తన మూడో సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అఖిల్ కు ఏర్పడింది.

జనవరి10న తన మూడో సినిమా అనౌన్స్ చేస్తానని చెప్పాడు అఖిల్. ఆ తర్వాత రెండు-మూడు డేట్స్ మారాయి కానీ.. ప్రాజెక్ట్ కన్ఫాం కాలేదు. ఈలోగా అనేక మంది దర్శకుల పేర్లు అఖిల్ మూడో సినిమాతో లింక్ అయి వినిపించాయి. కానీ వీటిలో దేని గురించి ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. రీసెంట్ గా అయితే కొరటాల శివతో అఖిల్ మూవీ అంటూ ప్రచారం జరుగుతోంది. కానీ.. ఇప్పట్లో అఖిల్ మూడో సినిమాపై అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం లేదట. అక్కినేని కుర్రాడి పుట్టిన రోజు అయిన ఏప్రిల్ 8న ఈ ప్రకటన వస్తుందని తెలుస్తోంది.

ఆ రోజున తన 23వ పుట్టినరోజు జరుపుకోనున్నాడు అఖిల్. అదే రోజున కొత్త సినిమా అనౌన్స్ మెంట్ ఇస్తాడట. ఇక రీసెంట్ గా తొలిప్రేమతో బ్లాక్ బస్టర్ సాధించిన వెంకీ అట్లూరితో కూడా అక్కినేని టీం చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఓ క్యూట్ లవ్ స్టోరీకి సబ్జెక్ట్ ఇస్తే.. సినిమా చేద్దామనే ఆఫర్ వెంకీ అట్లూరి అందినట్లు టాక్ వినిపిస్తోంది.