Begin typing your search above and press return to search.
ఎవరీ.. వెంకీ అట్లూరి?
By: Tupaki Desk | 11 Feb 2018 7:44 AM GMTఇప్పుడు టాలీవుడ్ జనాలు.. తెలుగు ప్రేక్షకులు ప్రధానంగా చర్చించుకుంటున్నది ‘తొలి ప్రేమ’ సినిమా గురించే. ఈ శుక్రవారం విడుదలైన సినిమాలు రెండూ నిరాశ పరచగా.. ‘తొలి ప్రేమ’ మంచి టాక్ తో మొదలై అదిరిపోయే వసూళ్లతో దూసుకెళ్తోంది. రెండు రోజుల ముందే యుఎస్ లో ప్రిమియర్లు పడిపోవడం.. పాజిటివ్ టాక్ రావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మంచి హైపే వచ్చింది. ఇక్కడ కూడా ఈ సినిమాకు మంచి టాకే వచ్చింది.
రెండు దశాబ్దాల కిందట కరుణాకరన్ అనే కొత్త దర్శకుడు పవన్ కళ్యాణ్ తో ‘తొలి ప్రేమ’ తీసి సంచలనం సృష్టించాడు. అప్పుడా దర్శకుడి పేరు మార్మోగిపోయింది. ఇప్పుడు ఆస్థాయిలో కాకపోయినా ఈ ‘తొలి ప్రేమ’తో దర్శకుడిగా పరిచయమైన వెంకీ అట్లూరి గురించి కూడా పెద్ద చర్చే నడుస్తోంది. దర్శకుడిగా ఇతను కొత్తే కానీ.. ఇండస్ట్రీకి కొత్తేం కాదు. ‘జ్ఞాపకం’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడీ కుర్రాడు. ఆ తర్వాత ‘స్నేహగీతం’లోనూ ఓ కీలక పాత్రలో నటించాడు. ఐతే నటుడిగా అతడికి ఆశించిన ఫలితాలు అందలేదు.
అప్పుడే అతను దర్శకుడు కావాలనుకున్నాడు. ముందు రచయితగా తన ప్రస్థానం ఆరంభించాడు. కొన్ని సినిమాలకు పని చేశాక దర్శకుడు కావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ముందు రవితేజ కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ తర్వాత దిల్ రాజు నిర్మాణంలో వరుణ్ హీరోగా సినిమా కుదిరింది. ‘లోఫర్’ కంటే ముందు ఈ సినిమా ఓకే అయింది. కానీ దిల్ రాజు ఈ సినిమాను మొదలుపెట్టడంలో ఆలస్యం చేశాడు. దీంతో సుహృద్భావ వాతావరణంలోనే రాజుకు టాటా చెప్పేసి బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ కు కథ చెప్పి ఒప్పించి ఆయన నిర్మాణంలో ‘తొలి ప్రేమ’ చేశాడు వెంకీ. ఈ సినిమాను రాజు నిర్మించకపోయినప్పటికీ.. తర్వాత ఆయనే సినిమా చూసి నచ్చి హోల్ సేల్ గా కొనేసి తన బేనర్ ద్వారా రిలీజ్ చేశాడు.