Begin typing your search above and press return to search.
ఆ ప్రాజెక్ట్ కోసం వెంకీ కూతురు వెయిటింగ్!
By: Tupaki Desk | 2 Jun 2022 3:56 AM GMTటాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాల తో ప్రత్యేకంగా తన మార్కెట్ ను పెంచుకునే అతి కొద్దిమంది హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. హీరోల మధ్య విభేదాలు ఎక్కువగా ఉంటాయి అనే కామెంట్స్ కు వెంకటేష్ మొదటిసారి మల్టీస్టారర్ సినిమా చేసి ఆ వార్తలకు ముగింపు కార్డు వేశాడు.
మల్టీస్టారర్ సినిమాలు కూడా ఇండస్ట్రీలో రావడానికి ఆయన మంచి ఉదాహరణ అని కూడా చెప్పవచ్చు. ఇక చాలా రోజులుగా తన అన్నయ్య కొడుకు రానా దగ్గుబాటి తో కూడా ఓ సినిమా చేయాలని ఎదురుచూస్తూ ఉన్నాడు.
ఇక మొత్తానికి రానానాయుడు అనే ఒక వెబ్ సిరీస్ ద్వారా కలిసి చేసే అవకాశం దొరికింది. ఈ ప్రాజెక్ట్ పై అయితే ఓ వర్గం ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వెబ్ సిరీస్ కు సంబంధించిన షూటింగ్ పనులు అన్నీ కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం టెక్నీషియన్స్ అందరూ కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ ప్రాజెక్టు నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.
అయితే ఈ ప్రాజెక్ట్ పై స్పందించిన వెంకటేష్ దగ్గుబాటి టాలెంట్ యూనిట్ తో పని చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది అని త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల అవుతుంది అని అలాగే వెబ్ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని కూడా అన్నారు.
రానా దగ్గుబాటి ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా షేర్ చేశారు. వెంకటేష్ కుమార్తె ఆశ్రిత ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు లవ్ సింబల్ తో తన అభిమానాన్ని చాటుకుంది.
ఈ ప్రాజెక్టు కోసం ప్రేక్షకులతో పాటు చాలా మంది సినీ ప్రముఖులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక వెంకటేష్ కూతురు కూడా తండ్రి అన్నయ్యను ఒకే ఫ్రేమ్‌లో చూడడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు అర్థమవుతోంది. మరి మొదటిసారి రాబోతున్న ఈ దగ్గుబాటి కాంబినేషన్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.