Begin typing your search above and press return to search.

వెంకీ 'దృశ్యం2' డైరక్ట్ ఓటీటిలో?

By:  Tupaki Desk   |   17 April 2021 3:30 PM GMT
వెంకీ  దృశ్యం2 డైరక్ట్ ఓటీటిలో?
X
ఆరు సంవత్సరాల క్రితం మలయాళంలో సెన్సెషనల్ హిట్ సాధించిన సినిమా ' దృశ్యం '. ఈ సినిమా తెలుగు, తమిళంతోపాటు మరో మూడు భాషల్లో రీమేక్ అయ్యి.. అక్కడ కూడా ఘన విజయం సాధించింది. ఈ సినిమా సిక్వెల్‏ను మరోసారి మలయాళంలో తెరకెక్కిస్తే అదీ పెద్ద హిట్టైంది. మలయాళ స్టార్ మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలో నటించగా.. జీతు జోసెఫ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్‏లో విడుదల చేశారు. అక్కడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాంతో ఈ సినిమాని తెలుగులో తొలి భాగంలో నటించిన వెంకటేష్ తో రీమేక్ చేస్తున్నారు. 'దృశ్యం2' ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ అందుకున్న కొన్ని రోజులకే తెలుగులో షూటింగ్ ప్రారంభించారు. దృశ్యం సినిమాలో నటించిన నటీనటులే ఈ ఇందులోనూ నటిస్తున్నారు.

సీక్వెల్ ప్రారంభించినప్పుడు ఈ సినిమా థియోటర్ లోనే రిలీజ్ చేద్దామనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. అయితే ఇప్పుడు పరిస్దితులు ఒక్కసారిగా మారిపోయాయి. కరోనా మళ్లీ జనాలను బయిటకు రానివ్వటం లేదు. అంతటా కరోనా విశ్వరూపం ధరించి భయపెడుతోంది. ఈ నేపధ్యంలో మళ్లీ ఓటీటిలకు డిమాండ్ పెరుగుతోంది. మంచి సినిమాలు వాళ్లకు కావాలి. వాళ్ల దృష్టి ఇప్పుడు 'దృశ్యం2' పై పడిందని సమాచారం.

'దృశ్యం2' అమేజాన్ ప్రైమ్ కు మంచి లాభాలు, సబ్ స్కైబర్స్ ని తెచ్చిపెట్టింది. అదే విధంగా తెలుగు దృశ్యం 2 ను కూడా తమ ఓటీటిలో రిలీజ్ చేస్తే అదే స్దాయిలో తెలుగులో కూడా అమేజాన్ కు కలిసివస్తుందని భావించి నిర్మాత సురేష్ బాబుని సంప్రదించారట. ఈలోగా నెట్ ప్లిక్స్ , ఆహా కూడా 'దృశ్యం2' ని తమ ఓటీటిలో స్ట్రీమ్ చేస్తామని రైట్స్ అడగటం మొదలెట్టారట. దాంతో సురేష్ బాబు ఆలోచనలో పడ్డారట. 'దృశ్యం2' మళయాళ వెర్షన్ ...ఓటీటిలో రిలీజ్ చేసినా నష్టపోయిందేమీ లేదు. మంచి రేటు వచ్చింది. జనాలు బాగా చూసి హిట్ చేసారు. అలాగే తెలుగు వెర్షన్ కూడా ఓటీటిలో చేస్తే వచ్చే నష్టం ఏముంది, అంతగా కాకపోతే కరోనా తీవ్రత తగ్గాక థియోటర్ రిలీజ్ పెట్టుకుందామనే ఆలోచన చేస్తున్నారట. అయితే ఈ విషయమై ఇంకా క్లారిటీ ఏమీ రాలేదట.

వెంకటేశ్‌, మీనా కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'దృశ్యం2'. గత కొన్నిరోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా గురువారంతో వెంకటేశ్‌ షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది. ఒరిజనల్ మళయాళి వెర్షన్ ను తెరకెక్కించిన దర్శకుడు జితు జోసఫ్‌ రీమేక్‌ను కూడా తీర్చిదిద్దుతున్నారు. సస్పెన్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమా ఖచ్చితంగా తెలుగులో మరో సెన్సేషన్ ఫిల్మ్ అవుతుందని భావిస్తున్న్రారు. ఈ సినిమాలో మీనా, కృతికా జయకుమార్, ఎస్తర్ అనిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.