Begin typing your search above and press return to search.

పెద్ద బ్యానర్ కు ఛలో

By:  Tupaki Desk   |   10 Feb 2018 4:49 AM GMT
పెద్ద బ్యానర్ కు ఛలో
X
చక్కటి పాటలు.. ఓ మంచి ప్రేమకథ.. కాస్తంత ఎంటర్ టెయిన్ మెంట్ అన్నీ జోడించి ఛలో సినిమా తీసి డీసెంట్ హిట్ కొట్టాడు డైరెక్టర్ వెంకీ కుడుముల. యంగ్ హీరో నాగశౌర్య సొంతంగా నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను బాగానే ఆకట్టుకుంది. శాండల్ వుడ్ హీరోయిన్ రష్మిక మండన్న ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఇక్కడి ప్రేక్షకులను మైమరిపిస్తోంది.

ఛలో సినిమాకు వచ్చిన హిట్ టాక్ వెంకీ కుడుములకు మరో అవకాశాన్ని తెచ్చిపెట్టింది. టాలీవుడ్ లో పెద్ద సినిమాలు వరసగా తీస్తూ వస్తున్న హారిక అండ్ హాసిని బ్యానర్ లో సినిమా డైరెక్ట్ చేసే అవకాశం వెంకీని వరించిందని టాలీవుడ్ లో న్యూస్ వినిపిస్తోంది. తాను తరవాత డైరెక్ట్ చేయదలచుకున్న కథకు సంబంధించి ఓ లైన్ ను వెంకీ నెరేట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ లైన్ నచ్చడంతో దీనికి సంబంధించి పూర్తి స్క్రిప్ట్ రెడీ చేస్తే సినిమా తీసేందుకు ప్రొడక్షన్ హౌస్ ఓకే చెప్పిందట. ఈ సినిమాను పెద్ద స్టార్లతో భారీగా తీయాలని మూవీ టీం ఆలోచిస్తోంది.

హారిక అండ్ హాసిని బ్యానర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు సొంత బ్యానర్ లాంటిది. వరసగా అతడితోనే సినిమాలు తీస్తూ వచ్చింది. ఇప్పుడు త్రివిక్రమ్ తో కాకుండా అతడి శిష్యుడుతో సినిమా తీయడానికి సిద్ధమవడమంటే విశేషమనే చెప్పాలి. గురువు త్రివిక్రమ్ లాగా వెంకీ కుడుములకు మంచి రైటింగ్ స్కిల్స్ ఉండటం అతడికి ప్లస్సయింది. ఇప్పుడు హారిక అండ్ హాసిని బ్యానర్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా సినిమా నిర్మిస్తోంది. దీని తరవాత వెంకీ సినిమా స్టార్టయ్యే అవకాశముంది.