Begin typing your search above and press return to search.

దర్శకుడి పట్టు నిర్మాత - హీరో కాంప్రమైజ్

By:  Tupaki Desk   |   17 Feb 2020 4:07 PM GMT
దర్శకుడి పట్టు నిర్మాత - హీరో కాంప్రమైజ్
X
ఏ సినిమా కయినా ఫైనల్ కాల్ అనేది నిర్మాత చేతుల్లోనే ఉంటుంది. డైరెక్టర్ ఛాయిస్ అనేది ఎంత ఉన్నప్పటికీ డబ్బు విషయం దగ్గర నిర్మాత ముందు ఏ దర్శకుడైనా లొంగాల్సిందే. అయితే కొన్ని సార్లు డైరెక్టర్ ఛాయిస్ ను రెస్పెక్ట్ చేసే సందర్భాలు కూడా ఉంటాయి. సరిగా 'భీష్మ' విషయంలో అదే జరిగింది.

ప్రీ ప్రొడక్షన్ సమయంలో సినిమాకు మణిశర్మ గారబ్బాయి సాగర్ మహతి నే తీసుకుందామని డిస్కర్షన్ లో చెప్పాడట వెంకీ కుడుముల. కానీ నిర్మాత నాగ వంశీ - హీరో నితిన్ సాగర్ మహాత్ ను కాకుండా మరెవరైనా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకుందామని పట్టుబట్టాడట. అలా కుదరదని తన నుండి బెస్ట్ సాంగ్స్ తీసుకొనే భాద్యత నాదంటూ వెంకీ హామీ ఇచ్చాడట. ఇక చేసేదేం లేక నిర్మాత , హీరో ఇద్దరూ కంప్రమైజ్ అయ్యారట.

ఈ విషయంలోనే కాదు ఛలో పనిచేసిన టీం నే మళ్ళీ తీసుకొని దర్శకుడిగా తను అనుకున్నది సాదించి సినిమాను రిలీజ్ రెడీ చేసాడు వెంకీ కుడుముల. ఇక ప్రెజెంట్ రిలీజయిన సాంగ్స్ హిట్ అవ్వడంతో నిర్మాత , హీరో ఇప్పుడు వెంకీ అండ్ మహతి సాగర్ ను మెచ్చుకుంటున్నారట. సో కొన్ని సార్లు నిర్మాతలు కూడా దర్శకుడికే ఫైనల్ కాల్ వదిలేస్తే ఇలాంటి బెటర్ అవుట్ పుట్ వస్తుందని కొందరు నిర్మాతలు తెలుసుకోవాలి.