Begin typing your search above and press return to search.

దర్శకుడు అభిమాని అయిన వేళ

By:  Tupaki Desk   |   26 Jan 2018 4:24 AM GMT
దర్శకుడు అభిమాని అయిన వేళ
X
చలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ మెగాస్టార్ నామస్మరణతో మారుమ్రోగిపోయింది. చిన్న బడ్జెట్ సినిమా ఫంక్షన్ కు ఆయన గెస్ట్ గా రావడం పట్ల యూనిట్ సభ్యులే కాక వచ్చిన అతిధులు కూడా తమ ఎగ్జైట్ మెంట్ ని మాటల్లో బయట పెట్టేసుకోవదం గమనార్హం. దీనికి దర్శకుడు వెంకీ కుడుముల కూడా మినహాయింపుగా నిలవలేదు. ఛలో సినిమాతో టాలీవుడ్ కు డైరెక్టర్ గా పరిచయమవుతున్న వెంకీ కుడుముల తన స్పీచ్ లో తాను ఎంత గొప్ప చిరంజీవి అభిమానినో చెప్పే క్రమంలో కాసేపు ఈ సినిమాకు దర్శకుడిని అనే విషయం మర్చిపోవడం విశేషం. తన ప్రసంగం మొదట్లో అందరిని ఆకాశంపైకి చూడమన్న వెంకీ అక్కడ ఏ స్టార్స్ కనిపించవని, ఎందుకంటే ఇక్కడ మెగాస్టార్ ఉన్నారని చెప్పి తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు.

ఇంద్ర, టాగోర్, స్టాలిన్ సినిమాలు చూడటం కోసం బట్టలు చింపుకుని కటవుట్లకు దండలు వేసిన వాళ్ళలో తానున్నని, జీవితంలో ఒక్కసారి కలిస్తే చాలు అనుకున్న తన అభిమాన హీరో ఏకంగా తాను దర్శకత్వం వహించిన ఛలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావడం గురించి చెప్పడానికి మాటలు చాలడం లేదని చెప్పిన వెంకీ కుడుముల ఇలాంటి సభల్లో జనం మధ్యలో కూర్చుని చూసిన తనకు ఇప్పుడు ఇలా స్టేజి పైకి వచ్చి అందరి ముందు దర్శకుడిగా మాట్లడే అవకాశం దక్కడం పట్ల శౌర్యతో పాటు నిర్మాతలైన శౌర్య అన్నయ్య, తల్లి తండ్రులకు థాంక్స్ చెప్పేసాడు.

జైసింహ నిర్మాత సి కళ్యాణ్ సైతం స్టార్స్ లో మెగాస్టార్ తర్వాతే ఏ స్టార్ అయినా చెప్పడం కొసమెరుపు. చిన్నప్పుడు అమ్మ ఇచ్చిన రూపాయి చిరు పోస్టర్స్ కొనడానికి వాడేవాడినని కళ్యాణి మాలిక్ చెప్పడం, నా ఏజ్ వాళ్ళకు ఆయనే స్ఫూర్తి అంటూ ప్రగతి ఇచ్చిన స్పీచ్ లతో ఛలో వేడుక విజయవంతంగా ముగిసింది. ఆంధ్ర - తమిళనాడు మధ్య ఉన్న సరిహద్దు గ్రామం నేపధ్యంగా తీసుకుని ఎంటర్ టైనింగ్ లవ్ స్టొరీ గా రూపొందిన ఛలో మూవీపై యూత్ లో మంచి అంచనాలే ఉన్నాయి.