Begin typing your search above and press return to search.
చిరు కోసం యంగ్ డైరెక్టర్ సీమ కథ
By: Tupaki Desk | 19 Feb 2022 11:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి మళ్లీ సీమ కథతో రాబోతున్నారా? ఈ సారి అంతకు మించిన ఎంటర్ టైన్ మెంట్ ని అందించే ప్లాన్‌లో వున్నారా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి మునుపెన్నడూ లేని విధంగా వరుసగా సినిమాలు అంగీకరిస్తూ షాకులిస్తున్నారు.
`సైరా నరసింహారెడ్డి` తరువాత వెంటనే సినిమా మొదలుపెట్టిన చిరంజీవి అది విడుదల కాకుండానే వరుసగా ఐదారు చిత్రాలని లైన్ లో పెట్టారు. కొరటాల శివతో `ఆచార్య` మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
కాజల్ అగర్వాల్ , పూజా హెగ్డే హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. ఈ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుండగానే మరో మూడు చిత్రాలని సెట్స్ పైకి తీసుకొచ్చారు. మలయాళంలో మోహన్ లాల్ నటించగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన `లూసీఫర్` ని తెలుగులో `గాడ్ ఫాదర్`గా రీమేక్ అవుతోంది. మెగాస్టార్ హీరోగా మోహన్ రాజా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు.
బాబీతో ఓ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ చేస్తున్న చిరు ఇదే ఊపుతో తమిళ చిత్రం `వేదాలం` ఆధారంగా రూపొందుతున్న `భోళా శంకర్`లోనూ నటిస్తున్నారు. కీర్తి సురేష్ ఇందులో చిరుకు చెల్లెలిగా నటిస్తోంది. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీకి మోహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాలన్నీ షూటింగ్ దశలో వున్నాయి. ఇదిలా వుంటే ఈ మూవీ స్ తో పాటు చిరు మరో యంగ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
నాగశౌర్యతో `ఛలో`...నితిన్ తో `భీష్మ` చిత్రాలని తెరకెక్కించి వరుసగా సూపర్ హిట్ లని సొంతం చేసుకున్నారు యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల. ఈ రెండు చిత్రాల తరువాత ఏకంగా ఆయన మెగాస్టార్ చిరంజీవితో సినిమాకు శ్రీకారం చుడుతున్నారు. `ఆర్ ఆర్ ఆర్` వంటి భారీ మల్టీస్టారర్ మూవీని నిర్మించిన స్టార్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య ఈ మూవీని నిర్మించబోతున్నారు. ఇప్పటికే చిరుకు లైన్ వినిపించిన ఫైనల్ చేసుకున్న వెంకీ కుడుముల .. మెగాస్టార్ కోసం రాయలసీమ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన కథని సిద్ధం చేస్తున్నారని తెలిసింది.
సీమ నేపథ్యంలో సాగే ఈ మూవీ ఫ్యాక్షన్ చిత్రాల పంథాలో కాకుండా `శంకర్ దాదా ఎంబీ బీఎస్` తరహాలో ఫుల్ కామెడీ అంశాలతో సాగనుందని తెలుస్తోంది. ఫిఫ్త్ జనరేషన్ కామెడీ పంచ్ లతో సాగనున్న ఈ మూవీలో మెగాస్టార్ క్యారెక్టర్ ఇన్ స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ గా కనిపిస్తారట. చిరు గత చిత్రాలకు పూర్తి భిన్నంగా పూర్తి స్థాయి కామెడీ అంశాలతో సినిమా వుంటుందని చెబుతున్నారు. ఇటీవలే స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టిన వెంకీ కుడుముల రెట్టించిన ఉత్సాహంతో పూర్తి చేసి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.