Begin typing your search above and press return to search.
ఛలో డైరెక్టర్ ఛాయిస్ తీసుకున్నాడు
By: Tupaki Desk | 14 March 2018 4:46 AM GMTకష్టాల్లో ఉన్న నాగశౌర్య సినిమాకు ఛలో సినిమాతో మంచి బ్రేక్ ఇచ్చాడు డైరెక్టర్ వెంకీ కుడుముల. ఆంధ్ర-తమిళనాడు బోర్డర్ తో లింకు పెట్టి నవ్వులు పూయించేలా తీసిన లవ్ స్టోరీ తెలుగు ప్రేక్షకులను బాగా మెప్పించింది. నాగశౌర్య కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా ఛలో రికార్డు సృష్టించింది. దీంతో డైరెక్టర్ వెంకీ కుడుములపై నిర్మాతల దృష్టి పడింది.
ఛలో తరవాత తమకో సినిమా చేసి పెట్టాలంటూ వెంకీ కుడుములకు ఆఫర్లు బాగానే వచ్చాయి. తన తరవాత సినిమా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చేయడానికి ఓకే చెప్పాడట. నాచులర్ స్టార్ నానితో ఈ బ్యానర్ పై సినిమా తీయాలన్నది ప్రొడ్యూసర్ సూర్యదేవర రాధాకృష్ణ ఆలోచన. దీంతో నానికి సరిపడే స్టోరీ లైన్ ను డైరెక్టర్ వెంకీ సిద్ధం చేసుకున్నాడట. ఓసారి నానిని కలిసి స్టోరీ నెరేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. నానికి కూడా వెంకీ తీసిన ఛలో మూవీ నచ్చడంతో వెంకీతో సినిమా చేయడానికి ఇంట్రస్ట్ చూపుతున్నాడని అతడి సన్నిహితులు చెబుతున్నారు.
నాని డెయిరీ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో కృష్ణార్జున యుద్ధం సినిమా చేస్తున్నాడు. దీని తరవాత నాగార్జున తో మల్టీ స్టారర్ లో నటించాల్సి ఉంది. దీంతోపాటు మైత్రీ మూవీస్ బ్యానర్ లో సంతోష్ శ్రీనివాస్ కూడా నానితో తీసేందుకు రెడీ అవుతున్నాడు. మరోవైపు నాని రీసెంట్ గా ప్రొడ్యూస్ చేసిన అ! మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తరవాత తీసే సినిమాలో నటించేందుకు ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఈ టైంలో నాని కాల్షీట్లు దొరకడమనేది వెంకీ చెప్పబోయే స్టోరీ నెరేట్ చేసే తీరును బట్టే ఉంటుంది. మరి ఎంతవరకు నానిని ఇంప్రెస్ చేస్తాడో లెట్స్ వెయిట్ అండ్ సీ.