Begin typing your search above and press return to search.

వెంకీ మామ డీసెంటుగా బ్రేక్ ఈవెన్

By:  Tupaki Desk   |   26 Dec 2019 6:58 AM GMT
వెంకీ మామ డీసెంటుగా బ్రేక్ ఈవెన్
X
విక్ట‌రీ వెంక‌టేష్‌-నాగ‌చైత‌న్య క‌థానాయ‌కులుగా న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ మూవీ `వెంకీ మామ`. పాయ‌ల్ రాజ్ పుత్- రాశీఖ‌న్నా క‌థానాయిక‌లు. బాబి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పీపుల్స్ మీడియాతో క‌లిసి సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమాకి డే వ‌న్ లో డివైడ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ ఓపెనింగులు ఫ‌ర్వాలేద‌నిపించాయి. ఫ్యామిలీ ఆడియెన్ లో వెంకీ ఇమేజ్.. చై ప‌రిణ‌తి చెందిన న‌ట‌న‌ సినిమాకు ప్ల‌స్ అయ్యాయి. రిలీజైన‌ రెండో వారంలోనూ ఈ చిత్రం విజ‌య‌వంతంగా ర‌న్ అవుతోంది.

ఇంత‌కీ ఈ సినిమాని కొనుక్కున్న‌ డిస్ట్రిబ్యూట‌ర్లు సేఫేనా? అంటే క్లోజ్ సోర్సెస్ అందించిన స‌మాచారం ప్ర‌కారం.. వెంకీమామ 36 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ చేయ‌గా.. ఇప్ప‌టికే ఆ మొత్తాన్ని రాబ‌ట్టింది. నిన్న‌(డిసెంబ‌ర్ 25) క్రిస్మ‌స్ హాలీడే నాటికి 37.40 కోట్లు వ‌సూలైంది. పంపిణీదారులు అంతా బ్రేక్ ఈవెన్ అయిన‌ట్టేన‌ని చెబుతున్నారు. ఏరియాల వారీగా ఎక్క‌డా డెఫిసిట్ ప‌డ‌లేదు. అన్నిచోట్లా షేర్స్ బాగా వ‌స్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది.

`వెంకీ మామ` త‌ర్వాత రిలీజైన సినిమాల్లో `ప్ర‌తిరోజూ పండ‌గే` సినిమాకి త‌ప్ప వేటికీ పాజిటివ్ టాక్ రాలేదు. దాంతో పాటే .. ఈ క్రిస్మ‌స్ సెల‌వులు వెంకీమామ‌కు ప్ల‌స్ అయ్యాయి. ప్ర‌స్తుతం వెంకీమామ‌కు ఇంకా థియేట‌ర్ల నుంచి స్థిరంగానే షేర్స్ వ‌స్తున్నాయ‌ని టాక్ వినిపిస్తోంది.