Begin typing your search above and press return to search.

మావ‌య్య‌ల‌కు అల్లుడు తెచ్చిన తంటా

By:  Tupaki Desk   |   26 Nov 2019 4:15 AM GMT
మావ‌య్య‌ల‌కు అల్లుడు తెచ్చిన తంటా
X
అల్లుడి తో అదిరిపోయే సినిమా తీయాల‌ని ఆ మావ‌య్య‌ల ఆరాటం. మామ - అల్లుళ్ల‌ను క‌లిపి సినిమా మొద‌లెట్టారు. కానీ అది కాస్తా చాంతాడంత సాగి బ‌డ్జెట్ ప‌రంగా త‌డిసి మోపెడ‌వుతోంద‌న్న గుస‌గుస‌లు ప్ర‌స్తుతం ఫిలింస‌ర్కిల్స్ ని వేడెక్కిస్తున్నాయి. అస‌లే నేల‌విడిచి సాము చేసే క‌థ‌ను ఎంచుకోవ‌డం చిక్కులు తెచ్చిందిట‌. తొలుత అనుకున్న బ‌డ్జెట్ కి ఆ త‌ర్వాత తేలిన ఖ‌ర్చుకు ఏమాత్రం పొంత‌న క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది.

హీరోల రేంజు కు త‌గ్గ‌ట్టు ఈ సినిమాని కేవ‌లం 30 కోట్ల‌ లో పూర్తి చేయాల‌ని ప్రారంభించారు. ఇప్ప‌టికే 55కోట్లు దాటింద‌ట‌. ఇంత అడ్డ‌గోలుగా బ‌డ్జెట్ పెర‌గడానికి కార‌ణాల్ని ప్ర‌స్తుతం విశ్లేషిస్తున్నారు. ఇప్ప‌టికే అయ్యిందేదో అయ్యింది.. క‌నీసం మార్కెటింగ్ లో అయినా నైపుణ్యం చూపించాల‌ని భావించార‌ట స‌దరు నిర్మాత‌. అయితే అది కూడా అంత సులువుగా అయ్యే ప‌ని కాద‌ని అర్థ‌మైంద‌ట‌.

థియేట్రిక‌ల్ రైట్స్- శాటిలైట్- డ‌బ్బింగ్ రైట్స్ అంటూ నిర్మాత‌కు లాభాలొచ్చినా .. బ‌య్య‌ర్లు భారీ పెట్టుబ‌డులు పెట్టాల్సిన ప‌రిస్థితి ఉంటుంది కాబ‌ట్టి ఈ సినిమా 2019 సంక్రాంతి కి వ‌చ్చిన‌ ఎఫ్ 2 రేంజు బ్లాక్ బ‌స్ట‌ర్ కావాల్సిందేన‌ని విశ్లేషిస్తున్నారు. 60-70 కోట్ల మేర షేర్ తెస్తేనే పంపిణీదారులు సేఫ్ అయిన‌ట్టు అని విశ్లేషిస్తున్నారు. ఎఫ్ 2 సంక్రాంతి సెల‌వుల్లో వ‌చ్చి ఘ‌న‌విజ‌యం సాధించింది. కానీ ఈ సినిమా సీన్ వేరు. డిసెంబ‌ర్ లాంటి అన్ సీజ‌న్ లో వ‌స్తోంది కాబ‌ట్టి ఏ మేర‌కు వ‌సూళ్లు తెస్తుందోన‌న్న ఆందోళ‌న నెల‌కొంద‌ట‌. మ‌రో వైపు ప్ర‌స్తుతం మార్కెట్ క‌రెక్ష‌న్ లో ప‌డింది. ఇటీవ‌ల డిజిట‌ల్ స్ట్రీమింగు కి ఆశించిన స్థాయి జ‌నాద‌ర‌ణ ద‌క్క‌క పోవ‌డంతో కంగుతిన్న అమెజాన్.. నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థ‌లు ఇప్పుడు పూర్తిగా ఫార్ములాని మార్చేసే ప‌నిలో ప‌డ్డాయి. దీంతో ఈ స‌న్నివేశం మింగుడు ప‌డ‌డం లేద‌ట‌.