Begin typing your search above and press return to search.

మామ ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌ని ట్రీట్!

By:  Tupaki Desk   |   3 Dec 2019 1:37 PM GMT
మామ ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌ని ట్రీట్!
X
విక్ట‌రీ వెంక‌టేష్- నాగ‌చైత‌న్య మామ అల్లుళ్లుగా న‌టించిన‌ చిత్రం `వెంకీ మామ‌`. రియ‌ల్ మామా అల్లుళ్లు తెర‌పై సంద‌డి చేస్తుండడంతో అభిమానుల్లో ఈ చిత్రంపై అంచ‌నాలున్నాయి. డిసెంబ‌ర్ 13న వెంక‌టేష్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా రిలీజ్ చేస్తున్నామ‌ని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఆ మేర‌కు రిలీజ్ సందిగ్ధ‌త‌కు స‌మాధాన‌మిస్తూ రూపొందించిన‌ రానా ప్ర‌మోష‌న‌ల్ వీడియో ఇప్ప‌టికే వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక‌కు తేదీ స‌హా వెన్యూ ఫిక్స‌య్యింది. చిత్ర‌బృందం వివ‌రాల ప్ర‌కారం.. ఖ‌మ్మం లేక్ వ్యూ క్ల‌బ్ వేదిక‌గా డిసెంబ‌ర్ 7 సాయంత్రం 6 గంట‌ల నుంచి ఈ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. అలాగే ఈనెల 4న సాయంత్రం 4.05 గంట‌ల‌కు కోకా కోలా పెప్సీ అనే మాస్ పాట‌ను రిలీజ్ చేస్తున్నారు. ఈ పాట‌లో వెంకీ-పాయ‌ల్ జోడీ.. చైత‌న్య‌- రాశీ ఖ‌న్నా జోడీ ఫిక‌ర్ పీక్స్ లో ఉంటుంద‌ని తెలుస్తోంది. మాస్ మాసాలా సాంగ్ ఇది.

పాట‌ల ట్రీట్ తో పాటు ప్రీరిలీజ్ ట్రీట్.. ట్రైల‌ర్ ట్రీట్ తో వెంకీమామ ప్ర‌మోష‌న్ ని మ‌రో లెవ‌ల్ కి తీసుకెళుతోంది చిత్ర‌బృందం. ఇక ఏ స్థాయి విజ‌యం సాధిస్తుంది? అన్న‌ది కాస్త‌ వేచి చూడాలి. బాబి ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్స్ మీడియాతో క‌లిసి డి.సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 55 కోట్ల బ‌డ్జెట్ పెట్టార‌న్న ప్ర‌చారం సాగుతోంది. ఆ మేర‌కు షేర్ టార్గెట్ గా ఈ చిత్రం రిలీజ్ కి వ‌స్తుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.