Begin typing your search above and press return to search.
వెంకీమామ ప్రీరిలీజ్ బిజినెస్
By: Tupaki Desk | 12 Dec 2019 6:19 AM GMTవిక్టరీ వెంకటేష్- నాగచైతన్య కథానాయకులు గా బాబి దర్శకత్వం వహించిన వెంకీమామ ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల లోకి రిలీజవుతోంది. పీపుల్స్ మీడియా - సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. వెంకీ గత చిత్రం ఎఫ్ 2 సక్సెస్ నేపథ్యంలో వెంకీమామకు బిజినెస్ ఓ మోస్తరుగా బాగానే చేశారని తాజాగా రివీలైన లెక్కలు చెబుతున్నాయి.
వెంకీమామ వరల్డ్ వైడ్ రైట్స్ పరిశీలిస్తే.. నైజాం-7.5కోట్లు.. సీడెడ్ -5.4కోట్లు.. ఏపీ-13.75కోట్లు.. ఓవర్సీస్-3కోట్లు.. ఇతర చోట్ల 2.75కోట్లు మేర బిజినెస్ చేసింది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ 33కోట్ల మేర బిజినెస్ సాగింది. అంటే ఆ మేరకు షేర్ ని థియేటర్ల నుంచి వసూలు చేస్తే సరిపోతుందా..? అంటే ఈ చిత్రానికి దాదాపు 43కోట్ల మేర బడ్జెట్ పెట్టారన్న ప్రచారం సాగింది కాబట్టి ఆ మేరకు షేర్ తేవాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే అంత వసూలవ్వాలంటే.. తొలి వీకెండ్ బాక్సాఫీస్ వద్ద జోరు చూపించాల్సి ఉంటుంది.
ఎఫ్ 2 రేంజు లో హిట్ టాక్ తెచ్చుకుంటేనే భారీ వసూళ్లు సాధ్యం. ఇప్పటికే అమెజాన్.. నెట్ ఫ్లిక్స్ సహా ఆన్ లైన్ స్ట్రీమింగ్ కంపెనీల పోటీ తెలుగు సినిమాకి ముప్పుగా పరిణమిస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాల్ని కేటగిరీల వారీగా విభజించి టీవీ స్క్రీన్స్.. మొబైల్ స్క్రీన్స్ పై కొన్నిటిని చూసేందుకే ఆసక్తిని కనబరుస్తున్నారు. మరి వెంకీ మామ ఫ్యాన్స్ పెద్ద తెరపై ఏ రేంజులో ఆడిస్తారో చూడాలి.