Begin typing your search above and press return to search.

సరిహద్దుల్లో వెంకీ మామ పోరాటం

By:  Tupaki Desk   |   11 May 2019 7:59 AM GMT
సరిహద్దుల్లో వెంకీ మామ పోరాటం
X
వరసకు నిజ జీవితంలో మేనమామ అల్లుళ్ళు అయినప్పటికీ ఆన్ స్క్రీన్ లో ఫుల్ లెన్త్ రోల్స్ ఒకే సినిమాలో చేయలేకపోయిన విక్టరీ వెంకటేష్ నాగ చైతన్య కలిసి మొదటిసారి నటిస్తున్న వెంకీ మామ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసేశారు. జై లవకుశ తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న దర్శకుడు బాబీ ఈ స్క్రిప్ట్ మీద చాలా కాలం వర్క్ చేసాడు.

ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ షూట్ కోసం కాశ్మీర్ సరిహద్దులో ఉన్న మిలిటరీ క్యాంపులతో పాటు హిమాలయ పర్వతాలు తదితర ప్రాంతాలను చుడుతూ లొకేషన్ ఫైనల్ చేయడం కోసం ట్రిప్ లో ఉన్నాడు బాబీ. వీటిని ఫైనల్ చేశాక యూనిట్ అక్కడికి వెళ్లనుంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇంధులో చైతు సైనికుడిగా నటిస్తున్నాడు. తను ఒక్కడే షూటింగ్ లో ఉంటాడా లేక వెంకటేష్ కూడా కలుస్తాడా అనే సస్పెన్స్. ఓ పాటను కూడా షూట్ చేయబోతున్నట్టు సమాచారం.

ఆరెక్స్ 100 ఫేమ్ పాయల్ రాజపుత్ వెంకీ సరసన చైతు జోడిగా రాశి ఖన్నా నటిస్తున్న వెంకీ మామను దసరాకు టార్గెట్ చేసి పూర్తి చేస్తున్నారు. మల్టీ స్టారర్ గా దీని మీద మంచి క్రేజ్ వచ్చేసింది, మజిలీ సూపర్ సక్సెస్ తో చైతు ఎఫ్2 ఇండస్ట్రీతో నాగ చైతన్య కొత్త ఏడాదిలో హిట్స్ అందుకున్నారు కాబట్టి ఆ రకంగా కూడా దీని మీద క్రేజ్ బాగా వచ్చేసింది. మరి సరిహద్దుల్లో వెంకీ మామ ఏం చేస్తాడో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి