Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్‌: అల్లుడిపై ప్రేమ పీక్స్ మామా

By:  Tupaki Desk   |   7 Dec 2019 3:17 PM GMT
ట్రైలర్ టాక్‌: అల్లుడిపై ప్రేమ పీక్స్ మామా
X
మామ అంటే అల్లుడికి అల్లుడు అంటే మామ‌కు ఉండే ప్రేమ ఎంత యూనిక్ గా ఉంటుందో చెప్పాల్సిన ప‌నేలేదు. ప‌ల్లెల్లో మామా అల్లుళ్ల అనుబంధం .. ఇ ఇద్ద‌రి మ‌ధ్యా దాగి ఉండే ప్రేమాప్యాయ‌త‌లు అనుబంధం.. ఎమోష‌న్ ఎంతో స్పెష‌ల్. ప్ర‌తి మామ‌కు అల్లుడితో ఉండే బాండింగ్ ఇక‌ ఎవ‌రితోనూ ఉండ‌దు. అందుకే స‌రిగ్గా అలాంటి థాట్ ప్రాసెస్ నుంచే సినిమా తీసే ప్ర‌య‌త్నం చేశాడు బాబి. అందుకోసం రియ‌ల్ లైఫ్ మామా అల్లుళ్లు అయిన వెంక‌టేష్ - నాగ‌చైత‌న్య‌ల‌ను ఎంపిక చేసుకున్నాడు. ఇది ద‌గ్గుబాటి రామానాయుడు డ్రీమ్ ప్రాజెక్ట్ కావ‌డంతో డి.సురేష్ బాబు ద‌గ్గ‌రుండి మ‌రీ ఎంతో కేర్ తీసుకున్నారు.

ఆ కేర్ అంతా తాజాగా రిలీజైన వెంకీ మామ ట్రైల‌ర్ లో క‌నిపిస్తోంది. ట్రైల‌ర్ ఆద్యంతం మామ‌పై అల్లుడి ప్రేమ‌.. అల్లుడిపై మామ ప్రేమ ఎమోష‌న్ ని పీక్స్ లో చూపించారు. ఇక బార్డ‌ర్ కి వెళ్లిన అల్లుడు ఎందుకు మిస్స‌య్యాడు? అంటూ మామ ఏకంగా బార్డ‌ర్ కే వెళ్లిపోయాడు. అక్క‌డ ఆర్మీతోనే పెట్టుకున్నాడు. ఈ విజువ‌ల్స్ అన్నీ అల్లుడిపై మామ ప్రేమ‌ను ఎలివేట్ చేస్తున్నాయి.

మ‌నిషి త‌ల‌రాత‌ను రాసే శ‌క్తి దేవుడికి ఉంద‌ని నీ న‌మ్మ‌కం.. ఆ రాత‌ను తిరిగి రాసే శ‌క్తి మ‌నిషి ప్రేమ‌కు ఉంద‌ని నా న‌మ్మ‌కం!! అంటూ వెంకీ మామ చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ మూవీ థీమ్ ని రివీల్ చేస్తోంది. ఇక ఇందులోనే రాశీ ఖ‌న్నాతో చైతూ ల‌వ్ స్టోరి.. పాయ‌ల్ తో వెంకీ ల‌వ్ స్టోరిని హైలైట్ చేశారు. ఇక హిందీ మాట్లాడే టీచ‌ర‌మ్మ‌గా పాయ‌ల్ కిక్కిస్తోంది. టీచ‌ర‌మ్మ‌తో వెంకీమామ ల‌వ్ ఎపిసోడ్స్ నుంచి బోలెడంత‌ ఫ‌న్ ఎలివేట్ కానుంది. జాత‌ర‌లో శ‌త్రువుల‌తో ఫైట్ .. ఇక ఈ క‌థ‌లో ఊరి ప‌గ‌లు ప్ర‌తీకారాలు.. కుట్ర‌లు కార్ప‌ణ్యాలు చూపించారు. మొత్తానికి అన్ని మ‌సాలాల్ని క‌ల‌గ‌లిపి వెంకీ మామ కోసం చాలా సాహ‌స‌మే చేసిన‌ట్టు అనిపిస్తోంది ఈ ట్రైల‌ర్ చూస్తుంటే. అయితే ట్రైల‌ర్ అంతా క‌ల‌ర్ ఫుల్ గా బాగానే ఉంది కానీ .. చివ‌రిగా ఇంకేదో మిస్స‌యిన‌ట్టుంది మామా!! అదేంటో కానీ!!