Begin typing your search above and press return to search.
సక్సెస్ సెంటిమెంట్ తో వెంకీ ఓటీటీ ఎంట్రీ
By: Tupaki Desk | 1 Sep 2021 8:30 AM GMTవిక్టరీ వెంకటేష్ తన కెరీర్ లో ఎన్నో రీమేక్ లు చేశాడు. టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు రీమేక్ లు చేశారు. కాని వెంకటేష్ చేసినన్ని రీమేక్ సినిమాలు మరెవ్వరు చేయలేదు అనడంలో సందేహం లేదు. ఈ ఏడాదిలో ఇప్పటికే వచ్చిన నారప్ప సినిమా తమిళ మూవీకి రీమేక్ గా త్వరలో విడుదల కాబోతున్న దృశ్యం 2 సినిమా కూడా మలయాళం దృశ్యం 2 కు రీమేక్ అనే విషయం తెల్సిందే. ప్రస్తుతం కూడా వెంకటేష్ రీమేక్ లపైనే దృష్టి పెట్టాడు. ఒక కొరియన్ మూవీని రీమేక్ చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇదే సమయంలో వెంకీ మామ త్వరలోనే ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్నాడు. ప్రస్తుతం ఓటీటీ టైమ్ నడుస్తుంది. కనుక ఓటీటీలో కంటెంట్ చేసేందుకు చాలా మంది స్టార్స్ ముందుకు వస్తున్నారు. వెంకీ కూడా వెబ్ సిరీస్ ను చేసేందుకు సిద్దం అయ్యాడు.
బాలీవుడ్ లో ఎంతో మంది స్టార్స్ వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. ఈ సమయంలోనే సౌత్ స్టార్స్ లో మొదటగా వెంకటేష్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం తనకు కెరీర్ లో ఎన్నో సక్సెస్ లు రీమేక్ ల ద్వారానే వచ్చాయి. కనుక తన ఓటీటీ ఎంట్రీ కూడా రీమేక్ ద్వారానే ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అందుకే సురేష్ బాబు ఒక స్పానిష్ సిరీస్ ను రీమేక్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. సురేష్ బాబు ఆ స్పానిష్ సిరీస్ హక్కులను కొనుగోలు చేశాడట.
నెట్ ఫ్లిక్స్ వారు ఈ వెబ్ సిరీస్ ను మొదట రీమేక్ చేసేందుకు గాను ప్రయత్నాలు చేసిందట. కొన్ని కారణాల వల్ల సిరీస్ రీమేక్ ను నెట్ ఫ్లిక్స్ వారు డ్రాప్ అయినా కూడా సురేష్ బాబు ఆ సిరీస్ ను రీమేక్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. వెంకటేష్ ఇమేజ్ కు తగ్గట్లుగా ఆ సిరీస్ ఉంటుందని అంటున్నారు. రీమేక్ చేసిన తర్వాత సురేష్ బాబు ఓటీటీ కి అమ్మేయబోతున్నాడు. వెంకటేష్ రీమేక్ లతో సెన్షేషనల్ సక్సెస్ లను దక్కించుకున్నాడు. కనుక ఓటీటీ ఎంట్రీ కూడా రీమేక్ కనుక ఖచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటాడు అనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.