Begin typing your search above and press return to search.
నెట్ ఫ్లిక్స్ సిరీస్ లో బాబాయ్ - అబ్బాయ్!
By: Tupaki Desk | 15 Aug 2021 2:38 PM GMTవెబ్ సిరీస్ లో నటిస్తే నామోషీ లేదిప్పుడు. చిన్న స్టార్ పెద్ద స్టార్ అనే విభేధం లేనే లేదు. ఎవరైనా వెబ్ సిరీస్ లలో నటించేస్తున్నారు. బాలీవుడ్ లో ఈ కల్చర్ చాలాకాలంగానే ఉన్నా తెలుగులో అలవాటు కావడానికి కొంత సమయం పట్టింది. ఇక ఇటీవలి కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోలంతా వెబ్ సిరీస్ ల మాయలో పడ్డారు.
సమంత నటించిన ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2 ఘనవిజయం తో స్టార్ల ఆలోచనా తీరు కూడా మారిందనే చెప్పాలి. ఇప్పటికే అగ్ర కథానాయికలంతా వెబ్ సిరీస్ లకు సంతకాలు చేసారు. నాగార్జున .. వెంకటేష్ .. నాగచైతన్య వంటి స్టార్లు ఇప్పుడు ఇదే బాటలో ఉన్నారు.
తాజా సమాచారం మేరకు విక్టరీ వెంకటేష్ కూడా ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు సన్నాహకాల్లో ఉన్నారని కన్ఫామ్ చేశారు సురేష్ బాబు.
వెంకీ ఓ హిందీ వెబ్ సిరీస్ చేయనున్నారని ఇందులో రానా దగ్గుబాటి కూడా ఓ కీలక పాత్ర పోషిస్తారని వెల్లడించారు. నెట్ ఫ్లిక్స్ భాగస్వామ్యంతో సురేష్ ప్రొడక్షన్సే ఈ సిరీస్ ను నిర్మించనుంది. వెంకీ - రానా ఇద్దరికీ హిందీ చిత్రసీమతో పరిచయం ఉంది. ఆ ఇద్దరూ బాలీవుడ్ లో నటించారు. కానీ ఇటీవల తెలుగు సినిమాలతోనే బిజీగా ఉన్నారు. ఇప్పుడు వెబ్ సిరీస్ ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు-తమిళం-హిందీలో ప్లాన్ చేస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. ఇది రెగ్యలర్ థ్రిల్లర్ తరహానా లేక తీవ్రవాదం సీరియస్ యాక్షన్ నేపథ్యంలో ఉంటుందా? అన్నదానిపై ఎలాంటి క్లూ లేదు.