Begin typing your search above and press return to search.
'నారప్ప' రిలీజ్ కు వ్యతిరేకంగా వెంకీ వీరాభిమాని నిరాహారదీక్ష
By: Tupaki Desk | 30 Jun 2021 4:30 AM GMTకరోనా కారణంగా గత ఏడాది కొన్ని నెలల పాటు థియేటర్లు మూత పడ్డాయి. ఇప్పుడు మళ్లీ సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు రన్ అవ్వడం లేదు. దాంతో పలు సినిమా లను ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వెంకటేష్ నటించిన నారప్ప మరియు దృశ్యం 2 సినిమా లను ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు సురేష్ బాబు చర్చలు పూర్తి చేశాడు. స్టార్ హీరోల సినిమాలు ఓటీటీ లో వస్తే ముందు ముందు థియేటర్ల పరిస్థితి దారుణంగా మారే అవకాశం ఉందని.. కనుక థియేటర్లు ఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత విడుదల చేయాలని కొందరు సినీ ప్రేమికులు కోరుతున్నారు.
థియేటర్లలో కాకుండా 'నారప్ప' సినిమా ను ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు సిద్దం అవ్వడం పట్ల వెంకటేష్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా నారప్ప సినిమా ను ఓటీటీ రిలీజ్ ను అడ్డుకోవాలంటూ ఆందోళన మొదలు అయ్యింది. వరంగల్ కు చెందిన అల్లుడు కిరణ్ నారప్ప సినిమా ఓటీటీ రిలీజ్ కు వ్యతిరేకంగా ఒక్క రోజు నిరాహార దీక్ష ను చేపట్టాడు. సినిమా ను ఖచ్చితంగా థియేటర్లలోనే విడుదల చేయాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నాడు.
నా వంతుగా నేను ఒక్క రోజు నిరాహార దీక్ష చేస్తున్నాను అంటూ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన కిరణ్ ఇతర వెంకటేష్ అభిమానులకు కూడా ఆదర్శంగా నిలిచాడు. వెంటనే నారప్ప సినిమా ఓటీటీ విడుదలకు వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనాలంటూ సూచించాడు. కిరణ్ షేర్ చేసిన ఈ ఫొటో వైరల్ అవుతోంది. నారప్ప ఓటీటీ వద్దంటూ నెట్టింట వరుస ట్వీట్స్ తో ఏకంగా నారప్ప హ్యాష్ ట్యాగ్ ఇండియా వైడ్ గా ట్రెండ్ అయ్యింది.