Begin typing your search above and press return to search.

ఆ నా కొడుకు మిస్సయ్యాడు.. శర్వా కి వెన్నెల కౌంటర్‌

By:  Tupaki Desk   |   11 Sep 2022 2:57 PM GMT
ఆ నా కొడుకు మిస్సయ్యాడు.. శర్వా కి వెన్నెల కౌంటర్‌
X
శర్వానంద్‌ చాలా కాలం తర్వాత ఒక మంచి సక్సెస్ పడటంతో హ్యాపీ మూడ్ లో ఉన్నాడు. ఒకే ఒక జీవితం సినిమాతో శర్వానంద్ సక్సెస్‌ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాలో అక్కినేని అమల.. వెన్నెల కిషోర్‌ మరియు ప్రియదర్శిలు కీలక పాత్రల్లో కనిపించారు. శర్వానంద్ తో పాటు సినిమాలోని ఆ మూడు పాత్రలు కూడా అత్యంత కీలకంగా ఉంటాయి అనే విషయం సినిమా చూస్తే అర్థం అవుతుంది.

సినిమా విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో హ్యాపీ మూడ్ లో యూనిట్‌ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో శర్వానంద్‌.. అమలా మరియు వెన్నెల కిషోర్‌ మిస్ అయ్యాడు. అంతకు ముందు ప్రెస్‌ మీట్‌ లో వెన్నెల కిషోర్ ఒక ముఖ్యమైన షూట్ లో ఉండటం వల్ల రాలేక పోయాడు.

దాంతో ఆ ప్రెస్ మీట్‌ లో శర్వానంద్‌ స్పందిస్తూ ఆ నా కొడుకు మిస్సయ్యాడు.. నేను అవకాశం ఇప్పించాను అంటూ వెన్నెల కిషోర్ గురించి కామెంట్స్ చేశాడట. ఆ కామెంట్స్ కి వెన్నెల కిషోర్ కౌంటర్‌ అన్నట్లుగా స్పందించి ప్రియదర్శి పై ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేయాల్సిందే అని శర్వానంద్‌ ని డిమాండ్‌ చేశాడు

ఆ నా కొడుకు ఈ సక్సెస్ ప్రెస్ మీట్ కి ఎందుకు రాలేదో అడగాలని శర్వానంద్ ను వెన్నెల కిషోర్ ప్రశ్నిస్తున్న సమయంలో శర్వా మాత్రం ప్రియదర్శి గారు.. ప్రియదర్శి గారు అంటూ సంభోదించడం మనం చూడవచ్చు. నా కొడక అంటూ శర్వానంద్ తీవ్ర స్థాయిలో వెన్నెల కిషోర్‌ ని తిట్టాడు అంటూ యూట్యూబ్‌ ల్లో పెద్ద ఎత్తున పోస్ట్‌ లు చేయడం వల్లే ఆయన కాస్త హర్ట్‌ అయ్యి శర్వానంద్‌ కి ఇలా వెన్నెల కిషోర్ కౌంటర్ వేసినట్లుగా టాక్‌ వినిపిస్తుంది.