Begin typing your search above and press return to search.

వెన్నెల కిషోర్ నాలుగో పెళ్లి ఆగిపోయింది

By:  Tupaki Desk   |   21 Jan 2016 1:30 AM GMT
వెన్నెల కిషోర్ నాలుగో పెళ్లి ఆగిపోయింది
X
టాలీవుడ్ లో ట్యాలెంటెడ్ కమెడియన్ గా గుర్తింపు పొందిన వెన్నెల కిషోర్ కి నాలుగో పెళ్లి కూడా ఆగిపోయింది. ఈ విషయాన్ని తనే వెల్లడించాడు. ట్విట్టర్ లో దీనిపై స్వయంగా పోస్ట్ చేశాడు కూడా. 'సినిమాల్లో కూడా పెళ్లిళ్ల సీజనే.. నాకు గుర్తున్నంత వరకూ ఈ వారం నా నాలుగో పెళ్లి కూడా ఆగిపోయింది'..అంటూ ట్వీట్ చేశాడు వెన్నెల కిషోర్.

ఇది చూడగానే గతంలో మూడు సార్లు పెళ్లి చేసుకున్నాడా, పీటల మీద పెళ్లి ఆగిపోయిందా అనిపిస్తుంది. ఇలా ఆగిపోవడం నిజమే కానీ.. అది నిజం పెళ్లి కాదన్నది అసలు నిజం. వెన్నెల కిషోర్ చెప్పినది సినిమాలో పెళ్లిళ్ల గురించి. సాధారణంగా మన తెలుగు సినిమాల్లో హీరో చేసుకోవాలని అనుకునే అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయిపోతూ ఉంటుంది. ఓ మ్యారేజ్ కోసం పెళ్లి కొడుకుగా ఓ బకరా కేరక్టర్ ని సృష్టిస్తారు. గతంలో ఇలాంటి రోల్స్ బ్రహ్మీ బాగానే చేసేవాడు. ఇప్పుడా రోల్స్ వరుసగా వెన్నెల కిషోర్ కి వస్తున్నాయి. వరుసగా ఇలాంటి కేరక్టర్స్ చేస్తుండడంతో.. వెన్నెల కిషోర్ అదే విషయాన్ని అభిమానులతో పంచుకునే ప్రయత్నం చేశాడు.

ఇప్పుడు ఇలాంటి సన్నివేశం నాలుగో సారి చేయాల్సి రావడంతో నాలుగో పెళ్లి కూడా ఆగిపోయిందంటూ ట్వీట్ చేశాడు వెన్నెల కిషోర్. కొన్ని వారాల్లోనే వరుసగా ఇలాంటి సన్నివేశాలు చేయాల్సి రావడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషమయే. ఏమైనా ఒకే ఒక ట్వీట్ తో జనాల అటెన్షన్ ని డ్రా చేయడంలో మాత్రం వెన్నెల కిషోర్ బాగానే సక్సెస్ అయ్యాడు. అందుకే కదా.. టాలీవుడ్ ఇతడిని ట్యాలెంటెడ్ కమెడియన్ గా చెప్తోంది.