Begin typing your search above and press return to search.

హాస్య కిశోరం పైకెక్కేస్తున్నాడు

By:  Tupaki Desk   |   27 May 2017 1:51 PM GMT
హాస్య కిశోరం పైకెక్కేస్తున్నాడు
X
మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఉన్నంత మంది కామిడీ యాక్టర్స్ మరే ఇండస్ట్రీ లోనూ లేరు ఉండబోరు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అసలు ఇప్పుడు వస్తున్న ఏ సినిమా చూసుకున్నా అందులో ఉండవలిసిన ఎలిమెంట్ హాస్యం. జనాలు కూడా సినిమా హాలుకు వచ్చి నవ్వడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. అది తెలిసి మన తెలుగు డైరెక్టర్లు కూడా కామిడీ ట్రాక్ లేకుండా సినిమాలుకు కథలు రాయటం లేదు.

అలా పుట్టిన ఒక హాస్య నటుడే కిశోర్ కుమార్. వెన్నెల సినిమాలో తను చేసిన పాత్ర వలన అతనిని అందరూ వెన్నెల కిశోర్ అని పిలుస్తారు. ఇలా ఏ కొద్దిమందికో అలాంటి భాగ్యం దక్కుతుంది. “సుత్తి” వేలు, “సాక్షి” రంగారావు, ‘పాయే’ బాబు మోహన్, 'శుభలేఖ' సుధాకర్.. అలా తొలిసినిమాను ఇంటిపేరుగా మార్చుకుని ప్రసిద్ది చెందినవారే. ఇకపోతే కిశోర్ శైలి ఇప్పుడున్న అందరి హాస్యనటులు నటనకన్నా ఆధునికంగా ఉంటుంది. తన చతురతను మాటలతో పాటుగా తన అభినయంతో కూడా చాలా చక్కగా సూక్ష్మమైన ఎక్సప్రెషన్లను కూడా బాగా పలికించగలడు. అందుకే తన సినిమాల హిట్-ఫ్లాప్ లతో సంబంధం లేకుండా కిశోర్ కి మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. తాజా సినిమాలు మజ్ను, ఎక్కడికిపోతావా చిన్నవాడ నిన్ననే విడుదలైన కేశవ ఇప్పుడు విడుదలైన రారాండోయ్ వేడుక చూద్దాం సినిమాలలో మనోడు టాకింగ్ పాయింట్ అయిపోయాడు.

టాప్ కామెడియన్స్ అందరూ ఒక్కక్కరుగా తమ తార స్థాయి నుండి నెమ్మదిగా కిందకు వస్తుంటే కిశోర్ ఒకో మెట్టు పైకి ఎక్కుతున్నాడు. ఒకానొకప్పుడు బ్రహ్మానందం లేనిదే ఒక సినిమా కూడా ఉండేది కాదు. ఆ తరువాత కొన్నాళ్ళు 30 ఇయర్స్ పృథ్వి కూడా టాప్ ఫామ్ లోకి వచ్చాడు. కానీ ఇప్పుడు ఫోకస్ కాస్త వెన్నెల కిశోర్ పై పెట్టింది తెలుగు సినిమా. అలా మరో స్టార్ కామెడియన్ పుట్టాడు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/