Begin typing your search above and press return to search.

ఆ విషయంలో వెన్నెల కిషోర్ ఒక్కడే!

By:  Tupaki Desk   |   27 Sep 2017 5:03 AM GMT
ఆ విషయంలో వెన్నెల కిషోర్ ఒక్కడే!
X
రోజుల లెక్కన పారితోషికం పుచ్చుకోవడం.. ఈ కాన్సెప్ట్ స్టార్ హీరోల్లో కంటే స్టార్ రేంజ్ అందుకున్న కమెడియన్స్ లో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా బ్రహ్మానందం నుంచి ఈ కల్చర్ ఇండస్ట్రీ మొత్తానికి పాకిపోయిందని అంటారు. సినిమాకు ఇన్ని రోజులు అని మాట్లాడుకోవడం కాకుండా.. ఎన్ని రోజులు అడిగితే అంత మొత్తం అంటూ బేరాలు కుదిరేవట. ఒకానొక సమయంలో.. రోజుకు ఐదు లక్షల చొప్పున బ్రహ్మీ పుచ్చుకున్న సందర్భాలు ఉన్నాయంటారు. ఇప్పుడు కూడా అంత మొత్తం అందుకునే వారు ఉన్నారు కానీ.. బ్రహ్మానందం అంత ఛార్జ్ చేసినప్పటి పరిస్థితి ఇప్పటి ఫిలిం మేకింగ్ కాస్ట్ లో చాలా తేడా ఉంది.

అసలు ఒక మూవీ హిట్ పడగానే.. నాలుగు ఛాన్సులు రాగానే కమెడియన్స్ ఈ యాంగిల్ లోకి వచ్చేస్తుంటారు. అయితే.. ఒకే ఒక్కడు మాత్రం ఇలా నిర్మాతలను భారీగా బాదేసేందుకు సై అనకుండా.. నై అంటున్నాడు. అతనెవరో కాదు.. వెన్నెల కిషోర్. వెన్నెల కిషోర్ కూడా రోజుల లెక్కనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నా.. ఒక్క రోజుకు ఇతడుతీసుకునే మొత్తం లక్ష రూపాయలు మాత్రమే కావడం విశేషం. క్యారెక్టర్ బాగుంటే.. ముందుగా ఒప్పుకున్న క్యాల్షీట్స్ కు మరిన్ని అదనంగా కూడా ఇస్తాడట. రీసెంట్ గా అమీతుమీ అంటూ హిట్ కొట్టినా.. కమెడియన్ గా కెరీర్ లో మంచి సక్సెస్ లు పడినా.. తన రెమ్యూనరేషన్ రేంజ్ ను మాత్రం రోజుకు లక్ష దగ్గరే మెయింటెయిన్ చేస్తుండడం విశేషం.

వరుసగా సినిమాలు చేస్తూ బిజీగానే ఉన్నాడు. బెల్లంకొండ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కోసం ఇప్పటివరకూ పొలాచ్చిలో గడిపిన వెన్నెల కిషోర్.. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ మూవీ కోసం హైద్రాబాద్ వచ్చి షూటింగ్ చేశాడు. ఆ తర్వాత గ్యాప్ కూడా లేకుండానే.. గుంటూరు వెళ్లి నాగశౌర్య సినిమాలో నటించేశాడు. ఇప్పుడు మళ్లీ హైద్రాబాద్ చేరుకుని.. ప్రభాస్ నటిస్తున్న సాహో కోసం షూటింగ్ లో పాల్గొంటున్నాడు వెన్నెల కిషోర్. తన కామెడీలో కంటెంట్.. మూవీస్ లో క్వాంటిటీ మినహాయిస్తే.. రెమ్యూనరేషన్ పెంచకుండా.. వెన్నెల కిషోర్ అనుసరిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.