Begin typing your search above and press return to search.
వెన్నెల కిశోర్ కు ఇది ఛాలెంజే
By: Tupaki Desk | 7 May 2019 10:47 AM GMTచాలా కాలంగా సక్సెస్ లేక స్ట్రగుల్ అవుతున్న సందీప్ కిషన్ హీరోగా రూపొందుతున్న నిను వీడని నీడను నేనే టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. అందులో చివరి షాట్ లో సందీప్ కిషన్ అద్దంలో చూసుకునే షాట్ లో వెన్నెల కిషోర్ కిషోర్ కనిపించే సీన్ వెరైటీగా ఉంది. హారర్ జానర్ లో రూపొందిన ఈ మూవీలో ఇలాంటి థ్రిల్స్ సహజమే కాని కమెడియన్ తో ఏదో ప్రయోగం చేసిన ఫీలింగ్ అయితే కలుగుతోంది.
గత కొంత కాలంగా ప్రేక్షకులు వెన్నెల కిషోర్ నుంచి హాస్యాన్నే కోరుకుంటున్నారు. దానికి తగ్గట్టే అతనూ అలాంటి పాత్రలతోనే మెప్పిస్తున్నాడు. అయితే నిను వీడని నీడను నేనేలో కాస్త సీరియస్ టచ్ ఉన్న పాత్ర ఏదో చేసినట్టు క్లూ ఇచ్చారు కాబట్టి అది ఏ స్థాయి మోతాదులో ఉంటుందో సినిమా చూపిస్తే కాని క్లారిటీ రాదు గతంలో హాస్య నటులు సీరియస్ పాత్రలు చేసిన దాఖలాలు లేకపోలేదు.
అమ్మలో బ్రహ్మానందం యమలీలలో అలీ మర్యాద రామన్నలో సునీల్ ఇలా కామెడీని సెంటిమెంట్ ని ఎమోషన్స్ ని బాలన్స్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఇది వెన్నెల కిషోర్ కు అలాంటి మార్పే ఇస్తుందేమో చూడాలి. ఒకరకమైన కంఫర్ట్ జోన్ లో ఉన్న కమెడియన్స్ ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేసినప్పుడే నటనకు మెరుగులు దిద్దుకునే అవకాశం దక్కుతుంది. మరి ఇన్నాళ్ళు నవ్వుల్లో ముంచెత్తిన వెన్నెల కిషోర్ ఈ నిను వీడని నీడను నేనేలో ఏం చేశాడో తెలియాలంటే విడుదల దాకా ఆగాల్సిందే