Begin typing your search above and press return to search.
పీకల్లోతున కూరుకుపోయిన వెన్నెల
By: Tupaki Desk | 8 Sep 2018 9:14 AM GMTడైరెక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాడు వెన్నెల కిషోర్. బుద్ధిగా విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకుని లక్షల్లో జీతం అందుకున్న అతడు డైరెక్టర్ అవ్వాలనుకుని, దేవాకట్టా వద్ద శిష్యుడిగా చేరి - అటుపై వేరొక ఆర్టిస్టు రాకపోవడంతో అనుకోకుండా వెన్నెల సినిమాలో కమెడియన్ అయిపోయాడు. ఇదంతా దేవా వల్లనే అని చెప్పాడు. ఒకసారి ఆర్టిస్టుగా ముఖంపై రంగు పడేసరికి ఇక దాన్ని వదులుకోలేకపోయానని తెలిపాడు. వెన్నెల సినిమాతో కమెడియన్‌గా పరిచయమయ్యాక, బ్రహ్మీ అభిమానిగా ఆ స్థాయికి ఎదగాలని కసిగా ప్రయత్నించాడు కిషోర్. ప్రస్తుతం ఆశించిన స్టార్‌డమ్ దక్కింది. బ్రహ్మానందం - సునీల్ - అలీ లాంటి కమెడియన్లు ఫేడవుట్ అవ్వడం అతడికి బాగా కలిసొచ్చింది. నవతరం కమెడియన్లు పరిమిత బడ్జెట్ సినిమాలకు ఆప్షన్ గా మారిన క్రమంలో అందులో పెద్ద స్థాయి కమెడియన్‌గా వెన్నెల చెలరేగిపోతున్నాడు. పెద్ద హీరోల సినిమాలన్నిటికీ అతడు ఒక ఆప్షన్ గా మారిపోయాడు. బ్రహ్మీ తర్వాత మళ్లీ రోజుకు రూ.2 - 5లక్షలు రేంజులో పారితోషికం అందుకునే కమెడియన్‌గా అతడి పేరు మార్మోగిపోతోంది.
ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న అన్ని క్రేజీ సినిమాల్లో వెన్నెల నటిస్తున్నాడు. దండీగానే పారితోషికాలు అందుకుంటున్నాడు. నాగచైతన్య హీరోగా నటించిన శైలజారెడ్డి అల్లుడు చిత్రంలో వెన్నెల పాత్ర మిరాకిల్ చేస్తుందిట. వాస్తవానికి వెన్నెల కామెడీ అంతగా సెట్ కాలేదని భావించిన టీమ్ ఇటీవల రీషూట్లు చేసిందని వార్తలొచ్చాయి. అంటే అవసరం మేర వెన్నెల పాత్రలో మార్పులు చేసి `గీతగోవిందం` ప్రీ క్లైమాక్స్ రేంజులో వర్కవుటయ్యేలా ప్లాన్ చేశారని చెప్పుకున్నారు. ఆ మేరకు మార్పు చేర్పులు వర్కవుటయ్యాయో లేదో కానీ, వెన్నెల మాత్రం సినిమా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాడు.
తాజాగా రిలీజ్ తేదీ ప్రచారాన్ని తన నెత్తికెత్తుకున్నాడు. ఇదిగో సెప్టెంబర్ 13న వచ్చేస్తున్నాం! అంటూ వెన్నెల కిషోర్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఇందులో పీకల్లోతు కప్పేసిన కిషోర్ ఎంతో ఫన్నీగా కనిపిస్తూ ఆకట్టుకున్నాడు. ఐడియా బాగానే ఉంది. ఆ చిన్న బిట్‌లో చేసినంత కామెడీ సినిమా అంతా చేస్తాడా.. లేదా? అన్నది చూడాలి. శైలజారెడ్డి అల్లుడు ఫేట్ ఏంటో మరో ఐదు రోజుల్లో తేలనుంది. చైతూ మాత్రం ఈ సినిమాపై చాలానే హోప్స్ పెట్టుకున్నాడు. అత్త- కూతుళ్లు ఇద్దరితో వేగలేని అల్లుడిగా కనిపించనున్నాడు ఈ మూవీలో. నాని-మారుతి కాంబోకి భలే భలే మగాడివోయ్ ఎంత పెద్ద హిట్టో అంత పెద్ద హిట్టు చైతూ-మారుతి కాంబోకి దక్కుతుందేమో చూడాలి.