Begin typing your search above and press return to search.
ఊప్స్ తో గూస్ బంప్స్ ఇచ్చాడు
By: Tupaki Desk | 15 Sep 2019 4:29 AM GMTన్యాచురల్ స్టార్ గ్యాంగ్ లీడర్ ఆశించినట్టే నానికి మరో బ్రేక్ లా మారుతోంది. విడుదలై రెండు రోజులే అయ్యింది కాబట్టి అప్పుడే ఫైనల్ స్టేటస్ గురించి కంక్లూజన్ కు రావడం తొందరపాటు అవుతుంది కానీ వసూళ్లు మాత్రం స్టడీగా ఉంటూ కెరీర్ హయ్యెస్ట్ వైపు తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. రివెంజ్ డ్రామానే అయినప్పటికీ తనదైన స్టైలిష్ స్క్రీన్ ప్లేకి కామెడీని మిక్స్ చేసి విక్రమ్ కుమార్ నడిపించిన తీరుకి ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు.
ఇటీవలి కాలంలో వెన్నెల కిషోర్ లేని సినిమాలు దాదాపుగా కనిపించడం లేదు. ఒకప్పుడు బ్రహ్మానందం ఆలీ లాంటి వాళ్ళు మాత్రమే ఈ డిమాండ్ ని ఎంజాయ్ చేశారు. ఇప్పుడు కిషోర్ కూడా అదే స్థాయిలో టాలీవుడ్ కు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ గా మారుతున్నాడు.
చిన్న పాత్ర అయినా సినిమా మొత్తం ఉండే లాంగ్ రోల్ అయినా తనకు మాత్రమే సాధ్యమయ్యే టైమింగ్ తో దూసుకెళ్తున్న వెన్నెల కిషోర్ అందరు సీనియర్ ఆర్టిస్టులు ఉన్న గ్యాంగ్ లీడర్ లోనూ తన ముద్ర వేశాడంటే సం థింగ్ స్పెషల్ అనే చెప్పాలి. మాములు కామెడీ వేషమైతే ఓకే కానీ కాస్త టిపికల్ గా అనిపించే గే రోల్ లో కిషోర్ మెప్పించడం ఒక ఎత్తైతే తనతో పాటు నాని సీన్ పండించిన తీరుకు థియేటర్లో నవ్వులు పూస్తున్నాయి
ఇక ఇందులో వెన్నెల కిషోర్ సినిమా మొత్తం కలిపి పావు గంటే ఉన్నప్పటికీ శెనక్కాయల సంతూర్ గా గే పాత్రలో మరోసారి మెమొరబుల్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. సినిమా సీరియస్ టోన్ లో సాగుతున్న సమయంలోనూ తన ఎపిసోడే నవ్వులు పూయించిందంటే అర్థం చేసుకోవచ్చు ఎంతగా ఆడుకున్నాడో .