Begin typing your search above and press return to search.
వెన్నెల కిషోర్ కు ఛాన్సివ్వాలే కానీ..
By: Tupaki Desk | 18 Jun 2016 5:10 AM GMTబ్రహ్మానందం.. ఎమ్మెస్ నారాయణ.. వేణుమాధవ్.. సునీల్.. వీళ్ల లాగా కమెడియన్ గా పీక్స్ అందుకోలేదు కానీ.. పెర్ఫామెన్స్ విషయంలో.. నవ్వించడంలో కానీ.. వాళ్లకేమీ తీసిపోడు వెన్నెల కిషోర్. తొలి సినిమా ‘వెన్నెల’ దగ్గర్నుంచి తనకంటూ ఓ ప్రత్యేక శైలి ఏర్పరుచుకుని తెలుగు ప్రేక్షకుల్ని నవ్విస్తున్నాడు కిషోర్. ఐతే ఎంతో టాలెంటున్నా.. ఛాన్స్ వచ్చిన ప్రతిసారీ కడుపుబ్బ నవ్విస్తున్నా.. అతను ఇంకా చేరాల్సిన హైట్స్ చేరలేదేమో అనిపిస్తుంది. మంచి క్యారెక్టర్ పడితే అతను ఏ స్థాయిలో ఎంటర్టైన్ చేయగలడో తాజాగా ‘జెంటిల్ మన్’ సినిమాతో మరోసారి రుజువు చేశాడు. ఇందులో సుదర్శనం.. షార్ట్ గా ‘దర్శనం’ అనే పాత్రలో కిషోర్ పంచిన వినోదాన్ని సినిమా చూసిన ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోలేరు.
కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగుల్ని వేధించుకు తినే హై లెవెల్ మేనేజ్మెంట్ వ్యక్తిగా కిషోర్ సింప్లీ సూపర్బ్ అంతే. అతడి ఇంట్రడక్షనే అదిరిపోయిందసలు. ఆ సన్నివేశం గురించి ఇక్కడ మాట్లాడుకోవడం కాదు కానీ.. తెరమీదే చూడాలి. సినిమాకు ప్రధాన ఆకర్షణగా ‘ఎక్స్’ కామెడీని కూడా తెరమీదే చూసి ఆస్వాదించాలి. మొత్తంగా సినిమాలో తాను కనిపించిన 20 నిమిషాల పాటు ఫుల్లుగా ఎంటర్టైన్ చేశాడు కిషోర్. మామూలుగా ఇంద్రగంటి సినిమాల్లో కామెడీ అంత లౌడ్ గా ఉండదు. హ్యూమర్ చాలా లైట్ గా ఉంటుంది. కిషోర్ కామెడీ కూడా అలాగే ఉన్నప్పటికీ కడుపుబ్బ నవ్వుకోవచ్చు. గత ఏడాది ‘భలే భలే మగాడివోయ్’.. ఈ మధ్య ‘సుప్రీమ్’ సినిమాలతో అదరగొట్టిన కిషోర్.. ‘జెంటిల్ మన్’లో వాటి కంటే మిన్నగా వినోదం పంచాడు.