Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : హాస్పటల్ లో వెన్నెల కిషోర్..

By:  Tupaki Desk   |   5 Aug 2016 10:10 AM IST
పిక్ టాక్ : హాస్పటల్ లో వెన్నెల కిషోర్..
X
కమెడియన్ వెన్నెల కిషోర్ నిన్న ట్విట్టర్ లో హాస్పిటల్ లో ఒంటి నిండా కట్లతో వున్న పిక్ ఒకటి అప్ లోడ్ చేశాడు. ఆదమరిచి చూస్తే కిషోర్ కి ఏమన్నా జరగరానిది జరిగిందా అన్న అనుమానం కలగక మానదు. కానీ కాస్త ఆగి చూస్తే అలాంటిది ఏమి లేదని, అది తాను పోషించిన పాత్రని అర్ధమవుతుంది.

నాని హీరోగా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన జెంటిల్ మెన్ సినిమాలో వెన్నెల కిషోర్ 'దర్శనం' అనే పాత్రలో దుమ్ము దులిపాడు. ముఖ్యంగా X లెటర్ పైన చేసిన కామెడీ, అతనిపై తీసిన షార్ట్ వీడియో బాగా పేలాయి.

ఈ సినిమా ఇప్పుడు 50 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా తనకీ పాత్ర చాలా దగ్గరైంది అంటూ దర్శకుడికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పిక్ పోస్ట్ చేశాడన్నమాట. ప్రస్తుతం చిరు 150వ సినిమాతో పాటూ కిషోర్ చేతినిండా సినిమాలతో బిజీగా వున్నాడు.