Begin typing your search above and press return to search.
హీరో వేణు.. ఏమైపోయాడు.. సడెన్‌గా ఎందుకు సినిమాలు వదిలేశాడు?
By: Tupaki Desk | 16 Dec 2020 12:30 AM GMTతెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు వేణు తొట్టెంపుడి. తొలి సినిమా స్వయం వరంతోనే హిట్ కొట్టాడు. ఆ తర్వాత ప్రారంభంలో వరసగా విజయాలు సాధించాడు. కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే ఆయన చివరగా 2012లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దమ్ము చిత్రంలో చేశాడు. ఆ సినిమా అట్టర్‌ప్లాప్ అయిన విషయం తెలిసిందే. అందులో వేణుకు మంచి పాత్రే దొరికినప్పటికీ సినిమా ప్లాప్ అయ్యింది. దీంతో ఆయనకు కారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా పెద్దగా అవకాశాలు రాలేదు.
మరోవైపు ఆయన చివరగా రామాచారి అనే ఓ సినిమాలో నటించాడు. ఆ సినిమా కూడా పరాజయం పాలైంది. ఫ్యామిలీ హీరోగా వేణుకు ఓ ఇమేజ్ వచ్చింది. కానీ ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ సినిమాలు పెద్దగా ఆడటం లేదు. దర్శకనిర్మాతలు కూడా అటువంటి సినిమాలు తీయడం లేదు. అందుకు కారణం ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్‌వైపు చూడకపోవడం. చాలామంది ఇళ్లల్లోనే సినిమాలు చూసేందుకు ఇష్టపడుతున్నారు. మహా అయితే ఓటీటీల్లో చూస్తారు. ఏడాదికోసారి.. పండగలప్పుడు మాత్రమే థియేటర్లకు వెళ్లే పరిస్థితి. ఇప్పుడైతే కరోనాతో థియేటర్లే మూతపడ్డాయి అది వేరేవిషయం. అయితే ఇటువంటి కారణాలతో వేణుకు తగ్గ కథలు రావడం లేదు.
మరోవైపు యువ హీరోలు వచ్చేశారు. దర్శక నిర్మాతలు కూడా యూత్‌ను దృష్టిలో ఉంచుకొని కథలు రాస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యామిలీ హీరోలకు కాలం చెల్లింది. శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు లాంటి ఫ్యామిలీ హీరోలు సైతం క్యారెక్టర్ ఆర్టిస్టులుగా స్థిరపడ్డారు. జగపతిబాబు అయితే విలన్ కారెక్టర్లు చేస్తున్నారు. ఈ క్రమంలో వేణుకు అటువంటి పాత్రలు కూడా రావడం లేదు. మరోవైపు ఆయన బిజినెస్‌లో చాలా బిజీ అయిపోయారు దీంతో సినిమాలు తగ్గించేశారు. బలమైన సామాజిక వర్గం అండ.. సినీ ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్నప్పటికీ వేణు ప్రస్తుతం సినిమాలవైపు చూడటం లేదు.
ఆయన దాదాపు 26 సినిమాల్లో హీరోగా నటించారు. స్వయం వరం, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్ , పెళ్ళాం ఊరెళితే , ఖుషి ఖుషీగా.. వంటి సినిమాలు భారీ హిట్ కొట్టాయి. 2000లో సంవత్సరంలో ఆయన అనుపమ చౌదరి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈమె ప్రముఖ వ్యాపారవేత్త, టీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్రావు కూతురు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మంలో టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేశారు కూడా. ప్రస్తుతం ఒకవేళ అవకాశం వచ్చినా వేణుకు సినిమాలు తీసే ఆసక్తి లేదట.