Begin typing your search above and press return to search.
వేణుమాధవ్ కు అసలు ఎంత ఆస్తి ఉందో తెలుసా?
By: Tupaki Desk | 25 Sep 2019 11:47 AM GMTటాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ అకాల మరణం సినిమా పరిశ్రమలో విషాదం నింపింది. కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులతో ఆయన కన్నుమూశారు. కొద్దిరోజులుగా వెంటాడిన అనారోగ్యం చివరకు వేణుమాధవ్ ను కొద్దిరోజులకే తీసుకెళ్లిపోయింది.
అయితే కమెడియన్ గా ఉన్నప్పుడు ఆయన సంపాదించింది ఎంత? వేణుమాధవ్ మరణంతో ఆయన కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఉందా.? అసలు వేణుమాధవ్ కు ఆస్తిపాస్తులు ఉన్నాయా అన్న చర్చ ఇప్పుడు సాగుతోంది. ఆయన అకాల మరణంతో ఆయన కుటుంబ పరిస్థితి ఏంటనే దానిపై అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.
అయితే కమెడియన్ గా వేణుమాధవ్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు చేసిన మంచి పనే ఇప్పుడు ఆయన కుటుంబాన్ని కాపాడింది. సినిమాల్లో సంపాదించిన డబ్బులను వేణుమాధవ్ భూములు - ఇళ్లు కొనిపెట్టుకున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
హైదరాబాద్ లోని ఈసీఐఎల్ నుంచి మౌలాలి వరకు పది ఇళ్లు ఉన్నాయని వేణుమాధవ్ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా తెలిపాడు. అలాగే కరీంనగర్ జిల్లాలో పది ఎకరాల వ్యవసాయ భూమిని కూడా కొని పెట్టాడు. సినిమాల్లోకి వెళ్లి నాశనమైపోతావ్ అని తన తండ్రి అంటుండేవాడని.. అందుకే సంపాదించినప్పుడే హైదరాబాద్ లో పది ఇల్లు - పదెకరాల భూమి కొని తన భార్యపిల్లలకు - తల్లిదండ్రులకు భోరోసా కల్పించానని వేణుమాధవ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.అదే ఇప్పుడు ఆయన కుటుంబానికి శ్రీరామరక్షగా మారిందంటున్నారు.