Begin typing your search above and press return to search.
కష్టాల్లో లేను.. నష్టాల్లోనూ లేను
By: Tupaki Desk | 21 Feb 2018 4:29 AM GMTఒకప్పుడు కమెడియన్ గా ఓ రేంజ్ లోకి వెళ్లాడు వేణుమాధవ్. అదే ఊపుతో రెండు... మూడు సినిమాల్లోనూ హీరోగానూ కనిపించాడు. అంతకుముందు దాదాపుగా ప్రతి సినిమాలోనూ కనిపించిన ఈ స్టార్ కమెడియన్ చాలారోజులుగా తెరమరుగైపోయాడు. దీంతో వేణుమాధవ్ ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయాడని.. ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉందని.. అందుకే సినిమాల్లో కనిపించడం లేదనే రూమర్లొచ్చాయి.
తాను కష్టాల్లోనూ లేనని.. నష్టాల్లోనూ లేనని.. ఆరోగ్యంగా.. ఆనందంగా ఉన్నానని అంటున్నాడు వేణుమాధవ్. డబుల్ మీనింగ్ డైలాగులుండే రోల్స్ చేయకూడదని తాను తీసుకున్న నిర్ణయం వల్లనే ఈ మధ్య సినిమాల్లో కనిపించడం లేదన్నాడు. ‘‘ఈ రోజుకు నాకు ఛాన్సులు వస్తూనే ఉన్నాయని.. వాటిలో నాకు నచ్చినవే చేస్తున్నా. నేను నటించిన ఐదు సినిమాలు త్వరలో రిలీజ్ అవబోతున్నాయి. నేను వెండితెరపై కనిపించకపోయే సరికి ఏకంగా చనిపోయానని కూడా కొందరు పుకార్లు ఫుట్టించారు. అది నన్ను తీవ్రంగా బాధపెట్టింది. ఇంకొందరు ఆరోగ్యం బాగాలేదంటూ ప్రచారం చేశారు. ఇవన్నీ అబద్ధాలే’’అంటూ తేల్చిచెప్పాడు వేణుమాధవ్.
‘‘డబ్బులు లేక కష్టాల్లో కూరుకుపోయాననే మాట అబద్ధమే. హైదరాబాద్ లో సొంత ఇల్లు.. ఫిలిం నగర్ దగ్గరలో ఫాం హౌస్ ఉన్నాయి. మా సొంతూళ్లో పొలాలున్నాయి. స్కూలుకెళ్లే ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ల పేరిట డబ్బు దాచా. వాళ్ల చదువు అయ్యేవరకు వెనక్కి తిరిగి చూసుకోవక్కర్లేదు. ’’అంటూ వేణుమాధవ్ తన ఫైనాన్షియల్ గా ప్లానింగ్ తో ఉన్నాడు బయటపెట్టాడు. దీంతో అతడిపై రూమర్లు సృష్టించేవారు ఇంక సైలెంట్ అయిపోవచ్చేమో.