Begin typing your search above and press return to search.
'ఆయనే కారణం' అంటూ ట్రోల్స్ పై స్పందించిన డైరెక్టర్
By: Tupaki Desk | 31 March 2021 6:44 AM GMTఈ మధ్యకాలంలో ఓ సినిమాను చూసి దాని మేకింగ్ స్టైల్ వేరేవాళ్లతో పోల్చడం కామన్ అయిపోయింది. అలా పోల్చడం కరెక్ట్ కాదు. కానీ సోషల్ మీడియాలో ఎవరి అభిప్రాయం వాళ్లు షేర్ చేసుకోవచ్చు కాబట్టి ఇలాంటివి నెగటివ్ న్యూస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. కానీ నిజానికి ఎవరి మేకింగ్ స్టైల్ వారిదే. ఓ డైరెక్టర్ దగ్గర ఎన్నేళ్లు పనిచేసినా తనకంటూ డిఫరెంట్ మేకింగ్ స్టైల్ గురించే ట్రై చేస్తాడు. కానీ ట్రోల్ చేసేవారు అవన్నీ పట్టించుకోరు. తాజాగా వకీల్ సాబ్ ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఐతే వకీల్ సాబ్ ట్రైలర్ చూసి ఈ సినిమా మేకింగ్ స్టైల్ డైరెక్టర్ త్రివిక్రమ్ లాగే ఉంది.. అలాగే ఆ ఛాయలు కనిపిస్తున్నట్లు పుకార్లు వచ్చాయి.
ఐతే తాజాగా వకీల్ సాబ్ డైరెక్టర్ వేణుశ్రీరామ్ ఈ పుకార్లపై చాలా క్లారిటీ ఇచ్చాడు. నిజానికి ఓ దర్శకుడికి ఇలాంటి ప్రశ్న ఎదురైనప్పుడు చాలా ఇన్సల్ట్ గా ఫీలవుతారు. కానీ డైరెక్టర్ వేణు అవేమి పట్టించుకోకుండా తన సమాధానం చెప్పేసాడు. వకీల్ సాబ్ స్క్రిప్ట్ విషయంలో మార్పులు సూచించింది త్రివిక్రమ్ అనే సంగతి తెలిసిందే. 'నన్ను ఈ సినిమా చేయడానికి ఆన్-బోర్డు చేసింది త్రివిక్రమ్ గారే. ఆయన అలవైకుంఠపురంలో పోస్ట్ ప్రొడక్షన్స్ కారణంగా వకీల్ సాబ్ స్క్రిప్ట్ పై వర్క్ చేయలేకపోయారు. అప్పుడు నన్ను పిలిచి వకీల్ సాబ్ స్క్రిప్ట్ రెడీ చేయిమని చెప్పారు. నిజానికి నేను త్రివిక్రమ్ గారి వర్క్ కి పెద్ద అభిమానిని. ఆయన వకీల్ సాబ్ స్క్రిప్ట్ పై వర్క్ చేసుంటే బాగుండేది. త్వరలో త్రివిక్రమ్ గారి స్క్రిప్ట్ ను డైరెక్ట్ చేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను" అని క్లారిటీ ఇచ్చాడు వేణు. డైరెక్టర్ స్పోర్టివ్ నెస్ చూసి నేటిజన్లు అభినందిస్తున్నారు. వకీల్ సాబ్ ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.