Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ త‌ర్వాత చిరంజీవితో ఉంటుందా?

By:  Tupaki Desk   |   8 April 2021 2:30 AM GMT
ప‌వ‌న్ త‌ర్వాత చిరంజీవితో ఉంటుందా?
X
అవ‌కాశం అదృష్టం క‌లిసొస్తే ఎవ‌రూ ఆప‌లేరు. అలా ఒక్కోసారి బ‌ళ్లు ఓడ‌లవుతుంటాయి. సినీప‌రిశ్ర‌మ‌లో ఒక్కోసారి ద‌ర్శ‌కుల‌కు అలాంటి ఆఫ‌ర్ల‌కు ఆస్కారం ఉంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ని డైరెక్ట్ చేసిన వేణు శ్రీ‌రామ్ కి అలాంటి పెద్ద‌ అవ‌కాశం అదృష్టం వెనువెంట‌నే త‌లుపు త‌ట్ట‌నుందా? అంటే అవున‌నే టాక్ వినిపిస్తోంది.

వ‌కీల్ సాబ్ ఘ‌న‌విజ‌యం సాధిస్తే ఇక అత‌డిని ఆప‌డం క‌ష్టం. ఆ వెంట‌నే మ‌రో స్టార్ హీరో కోసం స్క్రిప్టు రెడీ చేసుకోవ‌డ‌మే ఆల‌స్యం. వెంట‌నే మ‌రో సినిమాని ప్రారంభించేందుకు నిర్మాత దిల్ రాజు ఇప్ప‌టికే ఆఫ‌ర్ ఇచ్చార‌ని తెలిసింది. ఒక‌వేళ అది మెగాస్టార్ చిరంజీవితో సినిమా అయినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌ని ఊహిస్తున్నారు.

వ‌కీల్ సాబ్ ప‌వ‌న్ కి కంబ్యాక్ సినిమా. అందువ‌ల్ల అత‌డికి ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కం. అలాగే ప‌వ‌న్ తో తొలిసారి సినిమాని నిర్మిస్తున్న దిల్ రాజుకు కూడా ఇది చాలా కీల‌క‌మైన ప్రాజెక్ట్. వేణు శ్రీ‌రామ్ ఇంత‌కుముందు రెండు సినిమాలు చేసాడు కానీ అవి వేరు. వకీల్ సాబ్ వేరు. ఇది వేణు కెరీర్ మార్చే చిత్రం కావచ్చు. విజయం సాధిస్తే ఆ త‌రవాత వ‌రస‌గా పెద్ద హీరోల‌తోనే అవ‌కాశాలుంటాయి. అందుకే ఇది అత‌డికి చాలా చాలా ఇంపార్టెంట్.

దిల్ రాజు చేతిలో చాలా మంది స్టార్ హీరోల‌ తేదీలు ఉంటాయి కాబ‌ట్టి వేణుకి వెంట‌నే మ‌రో ఆఫ‌ర్ క‌ష్ట‌మేమీ కాదు. అయితే దేనికైనా హిట్టు కొట్ట‌డ‌మే స‌మాధానం. వకీల్ సాబ్ మొదట విజయవంతం కావాలి. జ‌నాల్లో ఈ చిత్రానికి హైప్ బాగుంది. వేణు ప‌నిత‌నంపైనా టాక్ బావుంది. మ‌రో రెండు రోజులే.. జ‌స్ట్ వెయిట్..!