Begin typing your search above and press return to search.
విరాటపర్వం.. ఆయన మాట వినుంటే భారీ నష్టం తప్పేది!
By: Tupaki Desk | 20 Jun 2022 6:30 AM GMTరానా మరియు సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన విరాటపర్వం సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత మూడు సంవత్సరాలుగా ఈ సినిమా గురించి మీడియాలో వార్తలు వస్తున్నాయి. కరోనా వల్ల విడుదల మరింత ఆలస్యం అయ్యింది. కరోనా సమయంలో పలు సినిమా లు డైరెక్ట్ ఓటీటీ లో రిలీజ్ అయ్యాయి. ముఖ్యంగా సురేష్ బాబు నిర్మించిన నారప్ప.. దృశ్యం 2 సినిమా లు ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యాయి.
సురేష్ బాబు చాలా తెలివిగా ఆ రెండు సినిమా లను ఓటీటీ కి ఇవ్వడం ద్వారా భారీ లాభాలు వచ్చాయి అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. విరాటపర్వం సినిమా ను కూడా సురేష్ బాబు ఓటీటీ కి ఇవ్వాలని బలంగా అనుకున్నాడు. కాని విరాటపర్వం సినిమా పూర్తి నిర్మాణ బాధ్యతలు ఆయన చూసుకోక పోవడంతో ఓటీటీ కి ఇవ్వాలనే నిర్ణయాన్ని అమలు చేయలేక పోయాడు.
దర్శకుడు వేణు ఉడుగుల మరియు నిర్మాత సుధాకర్ చెరుకూరి బలంగా థియేట్రికల్ రిలీజ్ కు వెళ్లాలని భావించారు. దాంతో సురేష్ బాబు కూడా సరే అన్నట్లుగా వదిలేసినట్లుగా తెలుస్తోంది. సురేష్ బాబు సమర్పకుడిగా విరాటపర్వం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. పాజిటివ్ రివ్యూలు రావడంతో సినిమాకు మంచి వసూళ్లు వస్తాయని అంతా భావించారు.
సినిమా విడుదల అయిన మొదటి రోజు వసూళ్ల విషయంలో తీవ్ర నిరాశ తప్పలేదు. వీకెండ్స్ లో అయినా సినిమా వసూళ్లు రాబడుతుందని అంతా భావించారు. కాని సినిమా శని ఆదివారాల్లో కూడా ఏమాత్రం ఆశాజనకమైన వసూళ్లను రాబట్టలేక పోయింది. దాదాపుగా 12.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విరాటపర్వం సినిమా రెండున్నర కోట్ల వరకు కూడా రాబట్టలేక పోతుందంటూ టాక్ వినిపిస్తుంది.
సాయి పల్లవికి ఉన్న ఫాలోయింగ్ మరియు సినిమాకు వచ్చిన రెస్పాన్స్ ను బట్టి భారీ వసూళ్లు ఖాయం అనుకున్నారు. కాని విరాటపర్వం టాక్ కు తగ్గట్లుగా వసూళ్లు నమోదు అవ్వడం లేదు. సినిమాను ఓటీటీ లో వస్తే చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. కాని థియేటర్ కు వెళ్లి చూడాలని మాత్రం కోరుకోవడం లేదు అనిపిస్తుంది.
వేణు ఉడుగుల చాలా అంచనాలు పెట్టుకుని థియేట్రికల్ రిలీజ్ చేసిన ఈ సినిమా భారీ నష్టాలతో థియేట్రికల్ రన్ క్లోజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక వేళ సురేష్ బాబు మాట విని సినిమా ను ఓటీటీ స్ట్రీమింగ్ కు ఇచ్చి ఉంటే నిర్మాత మరియు బయ్యర్లు నష్టాలు చవిచూడాల్సి రాకపోవచ్చు. ఇప్పుడు బయ్యర్లకు భారీ మొత్తంలో నష్టాలు చవి చూడబోతున్నారు. అందుకే సీనియర్ అయిన సురేష్ బాబు మాట విని ఉంటే బాగుండేది అనేది కొందరి అభిప్రాయం.