Begin typing your search above and press return to search.
ఆల్ ఖైదా కోసం అమెరికాలో వర్మ తిష్ట!
By: Tupaki Desk | 15 July 2022 4:30 PM GMTసంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ బయోపిక్ లు తెరకెక్కించినా...వాస్తవ కథల ఆధారంగా సినిమాలు చేసినా వాటిపై అన్వేషణ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. న్యూస్ పేపర్ల నుంచి సేకరించిన సమాచారం ఆయన సినిమాకి సరిపోదు. కథలో వీలైనంత రియాల్టీ చూపించాలంటే? ఎనాలసిస్ కూడా అంతే వాస్తవంగా ఉండాలి. అందుకే వర్మ అవకాశం ఉన్నంత వరకూ నేరుగా స్పాట్ నే సందర్శించడానికి ఆసక్తి చూపిస్తారు.
వాస్తవ పాత్రధారుల్ని కలిసి జరిగిన విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. వర్మ సక్సెస్ సీక్రెట్ కూడా ఇదే. వర్మ ఏ కథలోనైనా అందులో ఆత్మని పట్టుకునే ప్రయత్నం నిజంగా ప్రశంసనీయం. అందుకే వర్మ తెరకెక్కించే సినిమాల్లో వాస్తవికత అంతంగా హైలైట్ అవుతుంది. తాజాగా వర్మ ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా ని కెలుకుతోన్న సంగతి తెలిసిందే.
సరిగ్గా 20 ఏళ్ల క్రితం అమెరికా ట్విన్ టవర్స్ దాడిలో సూత్రధారిగా ఉన్న ఖాలీద్ మొహమ్మద్ కథ ఎంతో ఆసక్తి ఉంటుందని తెరకెక్కిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఇంగ్లీష్..అరిబిక్ భాషల్లో ఆ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. అరబిక్ లో సినమిఆ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. అందుకోసం వర్మ అమెరికా బయల్దేరడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. అమెరికాలో ఉండే ఆ చిత్రాన్ని పూర్తిచేసి రిలీజ్ అయ్యాకే ఇండియా తిరిగొచ్చేలా వర్మ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో వర్మ ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థ సహా ఖాలీద్ పూర్తి సమాచారం సేకరణ అమెరికాలో ఉండే చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంత సమాచారం తన దగ్గర ఉన్నప్పటికీ..అది సరిపోదని ట్విన్ టవర్ దాడి వెనుక అసలు వాస్తవాలు బయటకు తీయాలంటే? అక్కడే ఉండాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని తెలుస్తోంది.
ట్విన్ టవర్స్ దాడి తర్వాత అమెరికా ప్రభుత్వం యంత్రాగం..పోలీస్ యంత్రాంగం ఎలా పనిచేసింది? ఇంటర్ పోల్ యాక్టివిటీ వంటి వాటిపై కీలక ఆధారాలు రాబట్టాల్సి ఉందిట. అందుకే వర్మ వీలైనంత త్వరగా అమెరికా వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి వర్మ కొన్ని రోజుల్లేనే అమెరికా ప్లైట్ ఎక్కనున్నట్లు తెలుస్తోంది.
శుక్రవారం ఆయన తెరకెక్కించిన 'లడ్కీ' రిలీజ్ అయింది. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది .మార్షల్ ఆర్స్ట్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా వర్మ ఈజ్ బ్యాక్ అనిపించేలా ఉందని అంటున్నారు. అదే నిజమైతే ఆల్ ఖైదానికి టచ్ చేసే ముందు వర్మకి పాజిటివ్ సైన్ పడినట్లే. ప్రశాంతంగా..సంతోషంగా అమెరికా ప్లైట్ ఎక్కొచ్చు. ఆ రకంగా వర్మ కొన్ని నెలలు పాటు ఇండియాను వీడబో తున్నారు. మరి ఈ విషయాన్ని ఇంకా ట్విటర్లో వెల్లడించలేదు వర్మ.