Begin typing your search above and press return to search.

వర్మ... నువ్వు మామూలు రొమాంటిక్ కాదు గురూ!

By:  Tupaki Desk   |   17 May 2022 8:30 AM GMT
వర్మ... నువ్వు మామూలు రొమాంటిక్ కాదు గురూ!
X
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వయసు పెరిగినా కొద్ది రొమాంటిక్ యాంగిల్ పెరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆయన ఈమద్య కాలంలో హీరోయిన్స్ ను ఓ రేంజ్ లో చూపిస్తూ ఉన్నాడు. ఐస్ క్రీమ్‌ సినిమా లో హీరోయిన్‌ ను ఏ స్థాయిలో చూపించాడో అందరికి తెల్సిందే. న్యూడ్‌ అనే సినిమాలో అంతకు మించి అన్నట్లుగా వర్మ చూపించి అందరిని ఆశ్చర్యపర్చాడు. ఇక డేంజరస్ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ మద్య పీక్స్ లో రొమాన్స్ ను చూపించాడు.

కేవలం సినిమాల వరకే ఆయన రొమాంటిక్ యాంగిల్‌ అనుకోవడానికి లేదు.. ఆయన తనతో వర్క్ చేసిన హీరోయిన్స్ తో తీసుకున్న ఫోటోలను షేర్‌ చేస్తూ.. వాటికి పెడుతున్న కామెంట్స్ చూస్తూ ఉంటే బాబోయ్ వర్మ నువ్వు తోపు అన్నట్లుగా జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో వర్మ చాలా యాక్టివ్‌ గా ఉంటాడు.. ఆయన హీరోయిన్స్‌ ఎవరైనా హాట్ ఫోటోలు లేదా వీడియోలను షేర్ చేస్తే ఖచ్చితంగా స్పందిస్తాడు.

తాజాగా ఆయన తెరకెక్కించిన 'లడ్కీ' సినిమా హీరోయిన్‌ పూజా భలేకర్ ఒక వీడియోను షేర్‌ చేసింది. ఆ వీడియో లో బికినీతో పూజా భలేకర్‌ మతులు పోగొట్టే విధంగా ఉంది. ఆ వీడియోకు పూజా నన్ను నేను ఎలా ట్రీట్‌ చేసుకుంటానో మీరు అలాగే ట్రీట్‌ చేయండి అన్నట్లుగా కామెంట్‌ పెట్టింది. అందుకు రామ్‌ గోపాల్‌ వర్మ చాలా రొమాంటిక్ గా స్పందిస్తూ ట్విట్టర్‌ లో రియాక్ట్‌ అయ్యాడు.

ట్విట్టర్ లో వర్మ స్పందిస్తూ.. నిన్ను ఎలా ట్రీట్‌ చేయాలి? ఐస్ క్రీమ్‌ లాగానా అంటూ ప్రశ్నించాడు. అందుకు పూజా భలేకర్ స్పందిస్తూ... నన్ను ప్రేమతో ట్రీట్ చేయాలి.. ఈ వేసవిలో ఐస్‌ క్రీమ్‌ అనే సౌండ్‌ వినడానికి చాలా అహ్లాదకరంగా ఉందంటూ కూడా పేర్కొంది. మొత్తానికి వర్మ మరియు పూజాల మద్య జరిగిన ట్వీట్స్ చాలా రొమాంటిక్ గా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

వర్మ ఈ వయసులో కూడా ఇంకా ఈ స్థాయిలో రొమాంటిక్ గా ఉన్నాడేంట్రా బాబు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు నువ్వు తోపు గురూ అంటూ వర్మకు దండం పెడుతున్నట్లుగా ఈమోజీలు షేర్‌ చేస్తున్నారు. ఇక వర్మ ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్ట్‌ ల పై వర్క్ చేస్తున్నాడు. అందులో ఏది మొదట వస్తుంది అనే విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది.