Begin typing your search above and press return to search.
చాలా కాలం తర్వాత ఎమోషనల్ అయిన వర్మ
By: Tupaki Desk | 24 May 2021 5:38 AM GMTఎమోషన్స్ ఎక్కువగా ఉండని వ్యక్తి ఆర్జీవీ. సంతోషం మరియు దుఃఖం దేనిని అయినా సమానంగా స్వీకరిస్తాడని ఆర్జీవీకి పేరు ఉంది. బంధాలు బంధుత్వాలపై పెద్దగా నమ్మకం ఇంట్రెస్ట్ లేని వ్యక్తి రామ్ గోపాల్ వర్మ అనే విషయం అందరికి తెల్సిందే. ఒక మనిషి చనిపోతే వర్మ రియాక్షన్ చాలా నార్మల్ గా ఉంటుంది. ఎప్పుడైనా చనిపోవాల్సిందే కదా.. నీను నువ్వు కూడా చనిపోవాల్సిన వాళ్లమే కదా అనే అభిప్రాయంతో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి రామ్ గోపాల్ వర్మ వరుసకు సోదరుడు అయ్యే సోమశేఖర్ మృతి పై కాస్త ఎమోషనల్ అయినట్లుగా అనిపించాడు.
రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీలో ఉన్న కొత్తలో సోమ శేఖర్ కూడా ఇండస్ట్రీలో కొనసాగాడు. వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన పలు సినిమాలకు ప్రొడక్షన్ బాధ్యతలు చూసుకోవడం మొదలుకుని పలు విభాగాల్లో పని చేస్తూ ఉండేవాడు. వర్మ పలు సార్లు తన జీవితంలో చాలా కీలకమైన వ్యక్తి ముఖ్య మైన వ్యక్తి అంటూ సోమశేఖర్ గురించి మాట్లాడిన సందర్బాలు ఉన్నాయి. అలాంటి సోమ శేఖర్ కరోనాతో మృతి చెందడటంతో వర్మ స్పందించాడు.
గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్న సోమశేఖర్ కు ఇండస్ట్రీలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పలువురు ఆయన్ను గుర్తు చేసుకున్నారు. వర్మ స్పందిస్తూ.. గత కొంత కాలంగా ఇతర వ్యాపారాలతో అతడు మాకు దూరంగా ఉంటున్నాడు. నా జీవితంలో సోమశేఖర్ చాలా ముఖ్యమైన వ్యక్తి. అతడిని ఖచ్చితంగా చాలా మిస్ అవుతాను అన్నాడు. వర్మ ఇంతలా ఈమద్య కాలంలో ఎమోషనల్ అయ్యిందే లేదు. శ్రీదేవి చనిపోయిన సమయంలో ఎమోషనల్ అయిన వర్మ మళ్లీ ఇప్పుడు బాధపడుతున్నట్లుగా అనిపిస్తుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సోమశేఖర్ గురించి ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కూడా స్పందించాడు. తల్లికి కరోనా సోకిన సమయంలో ఆమె కోసం పరితపించాడు. ఆమె కోసం చాలా కష్టపడ్డాడు. ఆ క్రమంలోనే సోమశేఖర్ కరోనా బారిన పడ్డాడు. తల్లిని కాపాడుకున్న అతడు తనను తాను మాత్రం కాపాడుకోలేక పోయాడు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. సుదీర్ఘ కాలంగా సోమశేఖర్ మరియు బోనీ కపూర్ ల మద్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇంకా పలువురు సినీ ప్రముఖులు కూడా సోమశేఖర్ మృతిపై సంతాపం తెలియజేశారు.