Begin typing your search above and press return to search.
25 కేజీలు కట్.. సేతుపతి బిగ్ ఛాలెంజ్
By: Tupaki Desk | 6 March 2020 4:06 AM GMTకోలీవుడ్ లో కొందరు స్టార్ హీరోలు సిక్స్ ప్యాక్ లకు.. ఎయిట్ ప్యాక్ లకు దూరంగా ఉంటారు. అక్కడి అభిమానులకు నేచురాలిటీ రియాలిటీ ముఖ్యం. అందుకే డీగ్లామరస్ గా కనిపించేందుకే సిద్ధమవుతుంటారు. కొందరు స్టార్స్ అయితే శరీరాకృతి గురించి అస్సలు పట్టించుకోరు. అజిత్ - విజయ్ సేతుపతి లాంటి ఎలాంటి పాత్ర అయినా తమ శరీరంలో మార్పులేమి తీసుకురాకుండానే నటించేస్తుండడం చూస్తున్నదే. సూపర్ స్టార్ రజనీకాంత్ మొదలు అందరూ ఇదే దారిలో వెళుతున్నారు. తళా పండిపోయిన సిల్వర్ హెయిర్.. మాస్ పంచె కట్టుతోనే బోలెడంత మ్యాజిక్ చేసేస్తున్నారు. సేతుపతి సైతం కనీసం హీరోయిక్ అప్పియరెన్స్ కోసం ఏనాడూ పాకులాడింది లేదు. కేవలం నటనలో ఈజ్ మాత్రమే అతడు చూసేది. అయితే వీళ్లంతా మంచి నటులు కాబట్టి అక్కడ అలా చెల్లిపోతుంది. కానీ ఇతర భాషల్లో అలా నటిస్తామంటే కుదరదు. కచ్చితంగా ఫిట్ నెస్ పై దృష్టి పెట్టాలి. శరీరంలో మార్పులు తప్పని సరిగా తీసుకు రావాల్సిందే. మేకక్స్ చెప్పినట్లు మార్పులు తేవాల్సి ఉంటుంది.
తాజాగా విజయ్ సేతుపతి అన్ లిమిటెడ్ గా పెరిగిన బరువును తగ్గించే పనిలో ఉన్నాడని తెలుస్తోంది. సైరా చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన విజయ్ మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటిస్తోన్న ఉప్పెన లో ప్రతి నాయకుడు పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే అల్లు అర్జున్ 20వ చిత్రంలోనూ ఓ పాత్ర పోషిస్తున్నాడు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ నటిస్తోన్న లాల్ సింగ్ చద్దాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే బాలీవుడ్ సినిమాల్లో బొద్దుగా కనిపిస్తానంటే అక్కడి మేకర్స్ అస్సలు ఒప్పుకోరు. ఎంత చిన్న క్యారెక్టర్ అయినా స్లిమ్ గా ఫిట్ గా కనిపించాల్సిందే.
ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా కోసం విజయ్ 25 కేజీలు బరువు తగ్గాల్సి వస్తోందిట. ఇందులో విజయ్ జవాన్ పాత్రలో పోషిస్తుండటంతో ఆ పాత్ర డిమాండ్ మేరకు స్లిమ్ గా రెడీ అవ్వాల్సిందేనని అమీర్ అండ్ టీమ్ కోరారట. దీంతో విజయ్ ముందు అతి పెద్ద ఛాలెంజ్ ఉందనే అర్థమవుతోంది. విజయ్ సేతుపతి భారీ కటౌట్ తగ్గాలంటే జిమ్ముల్లో చాలానే శ్రమించాల్స ఉంటుంది. అతని వెయిట్ 100 కేజీలు పైనే ఉంటుందట. అందులో 25 కేజీలు తగ్గించాలంటే అహోరాత్రులు శ్రమిస్తేనే కుదురుతుంది. నిరంతరం రేయింబవళ్లు కరసత్తులు గట్టిగానే చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అమీర్ ఎంతో శ్రమించి తన పాత్ర కోసం 20 కిలోలు బరువు తగ్గారు. విజయ్ కూడా తగ్గితే ఇద్దరి పై సన్నివేశాలు చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. డెడ్ లైన్ పెట్టారు కాబట్టి సేతుపతికి కష్టం మొదలైనట్టే.