Begin typing your search above and press return to search.

క్రేజ్ ని క్యాష్ చేసుకునే పనిలో వర్సటైల్ హీరో..?

By:  Tupaki Desk   |   2 Nov 2022 7:30 AM GMT
క్రేజ్ ని క్యాష్ చేసుకునే పనిలో వర్సటైల్ హీరో..?
X
టాలెంటెట్ హీరో సత్యదేవ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. హీరోగా తనకంటూ ప్రత్యేకమైన తెచ్చుకోడానికి కృషి చేస్తున్న వర్సటైల్ యాక్టర్.. ఈ క్రమంలో వైవిధ్యమైన కథలు విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ వస్తున్నాడు.

ఓవైపు ప్రధాన పాత్రలు పోషిస్తున్నప్పటికీ.. మరోవైపు అవకాశం వచ్చినప్పుడు క్యారెక్టర్ రోల్స్ చేయడానికి వెనుకాడటం లేదు. ఇలా ఒకే సమయంలో రెండు విధాలుగా ప్రేక్షకులను అలరించిన నటుడు ఈ మధ్య కాలంలో ఎవరైనా ఉన్నారంటే అది సత్యదేవ్ అనే చెప్పాలి.

'బ్లఫ్ మాస్టర్' సినిమాలో నటన మెచ్చి సత్యదేవ్ ని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి.. "గాడ్ ఫాదర్" సినిమాలో అతన్ని మెయిన్ విలన్ గా నటింపజేశారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు.

అలానే అక్షయ్ కుమార్ "రామసేతు" సినిమాలో సత్యదేవ్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో అతనిది సహాయక పాత్ర. అయినప్పటికీ పాత్ర పరిధి మేరకు నటించి.. తన పెరఫార్మన్స్ తో హిందీ జనాల దృష్టిని ఆకర్షించాడు.

రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది పక్కన పెడితే ఈ రెండు సినిమాలు కూడా సత్యదేవ్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో నటుడు తన రాబోయే చిత్రాలకు అధిక పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నాడని నెట్టింట రూమర్స్ వినిపిస్తున్నాయి.

నిజానికి సత్యదేవ్‌ సోలో హీరోగా నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్స్ అందుకోలేదు. అతను లీడ్ రోల్ నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం ఓటీటీలలోనే రిలీజ్ అవడంతో.. థియేట్రికల్ మార్కెట్ ఎంత పలుకుతుందనేది కూడా అంచనా వేయలేం.

కానీ ఇప్పుడు 'గాడ్ ఫాదర్' మరియు 'రామ్ సేతు' సినిమాలు పేరు తెచ్చిపెట్టిన తర్వాత సత్యదేవ్.. అమాంతం తమ రెమ్యునరేషన్ ను పెంచేసాదట. హీరోగా చేసే సినిమాలే కాదు.. సపోర్ట్ రోల్స్ చేయడానికి కూడా భారీగా కోట్ చేస్తున్నాడట.

ఈ రెండు సినిమాలూ సత్యదేవ్ ను బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయం చేశాయి కాబట్టి.. తన మార్కెట్ ని విస్తరించుకోవాలనే ప్లాన్ లో ఉన్నాడట. క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడని.. ఈ క్రమంలో రెమ్యునరేషన్ రెట్టింపు చేశాడని అంటున్నారు.

అయితే సత్యదేవ్ ఇప్పటి వరకూ పరిమితంగానే పారితోషకం తీసుకుంటూ నిర్మాతలకు అందుబాటులో ఉంటూ వస్తున్నాడు కాబట్టే.. అందరూ అతనితో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. చేతి నిండా సినిమాలతో ఏడాది పొడవునా బిజీగా ఉండటానికి అది కూడా ఒక కారణం.

కానీ ఇప్పుడు రేటు పెంచేస్తే ఇంతకముందు మాదిరిగానే సత్యదేవ్ కు అవకాశాలు వస్తాయా అనే ప్రశ్నలు వస్తున్నాయి. సక్సెస్ వచ్చినప్పుడు సహజంగానే రెమ్యునరేషన్ పెరుగుతుంది కాబట్టి.. అందులో ఆయన్ని తప్పుబట్టాల్సింది ఏమీ లేదని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు.

ఇకపోతే తమన్నా భాటియా తో కలిసి సత్యదేవ్ చేసిన 'గుర్తుందా శీతాకాలం' సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. అప్పుడెప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న రొమాంటిక్ చిత్రం కోసం సరైన విడుదల తేదీని లాక్ చేయాలని చూస్తున్నారు.

కొరటాల శివ నిర్మాణంలో గోపాల కృష్ణ దర్శకత్వంలో సత్యదేవ్ నటించిన 'కృష్ణమ్మ' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఇక సత్యదేవ్ హోమ్ బ్యానర్ ఏర్పాటు చేసి రూపొందిస్తోన్న 'ఫుల్ బాటిల్' చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్స్ అతని వద్ద ఉన్నట్లు తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.