Begin typing your search above and press return to search.

చెర్రీ - ప్ర‌భాస్ ల ఫ్రెండు శ‌ర్వానంద్ పెళ్లి

By:  Tupaki Desk   |   5 Jan 2023 3:43 AM GMT
చెర్రీ - ప్ర‌భాస్ ల ఫ్రెండు శ‌ర్వానంద్ పెళ్లి
X
టాలీవుడ్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒక్కో వికెట్ నేల‌కూలుతున్నాయి. ఇంత‌కుముందే క‌రోనా లాక్ డౌన్ తీరిక‌ స‌మ‌యంలో ద‌గ్గుబాటి రానా- నిఖిల్ సిద్ధార్థ‌- నితిన్ రెడ్డి పెళ్లితో ఓ ఇంటివాళ్ల‌య్యారు. దీంతో త‌మ సుదీర్ఘ‌మైన బ్యాచిల‌ర్ షిప్ కి చెక్ ప‌డిపోయింది.

ప్ర‌భాస్ - శ‌ర్వానంద్ - విజ‌య్ దేవ‌ర‌కొండ - అఖిల్ ఇలా కొంద‌రు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ పెళ్లి ఎప్పుడు? అంటూ అభిమానులు మ‌ద‌నంలో ఉండ‌గా ఇప్పుడు మ‌రో వికెట్ ప‌డింది. వెర్స‌టైల్ స్టార్ శర్వానంద్ పెళ్లి పీటలెక్కేస్తున్నారు. శ‌ర్వా ఒక ఎన్నారై అమ్మాయిని పెళ్లాడ‌బోతున్నాడ‌ని తెలిసింది. త్వ‌ర‌లో నిశ్చితార్థం జ‌రిగేందుకు అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

శ‌ర్వాకు కాబోయే భార్య ఏం చేస్తారు? అన్న‌ది ఆరా తీస్తే.. అమెరికాకు చెందిన ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఆమె ప్ర‌స్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో స్వ‌స్థ‌లం హైద‌రాబాద్ నుంచే జాబ్ చేస్తున్నారు. 38 ఏళ్ల శర్వానంద్ ద‌శాబ్ధంన్న‌ర కెరీర్ లో విల‌క్ష‌ణ‌మైన‌ హీరోగా రాణించాడు. ప‌లు స్ఫూర్తివంత‌మైన సినిమాల్లో న‌టించాడు. గ‌మ్యం- శ‌త‌మానం భ‌వ‌తి లాంటి క్లాసిక్స్ అత‌డి కెరీర్ లో చాలా ప్ర‌త్యేక‌మైన‌వి.

ప్ర‌భాస్ - రామ్ చ‌ర‌ణ్ లాంటి స్టార్ల‌కు అత్యంత స‌న్నిహిత మిత్రుడైన‌ శర్వానంద్ టాలీవుడ్ లో స్థిరంగా సినిమాలు చేస్తూ త‌న‌ స్థానాన్ని ప‌దిలం చేసుకున్నాడు. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా అత‌డికి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన న‌టుడిగా చ‌క్క‌ని ప్ర‌తిభావంతుడిగా ద‌ర్శ‌క‌నిర్మాత‌ల డార్లింగ్ గా త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపు ఉంది.

వీట‌న్నిటినీ మించి అత‌డి ఒదిగి ఉండే స్వ‌భావం అంద‌రినీ స్నేహితులుగా మారుస్తుంది. 'శతమానం భవతి' నటుడి అంగ‌రంగ వైభ‌వ‌మైన పెళ్లి కోసం అభిమానులు ఉల్లాసంగా వేచి చూస్తున్నారు. శ‌ర్వా వెడ్ లాక్ గురించి అధికారికంగా స‌మాచారం వెలువ‌డాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.