Begin typing your search above and press return to search.

వెనక్కిచ్చిన బోయపాటి ?

By:  Tupaki Desk   |   26 Feb 2019 9:01 AM GMT
వెనక్కిచ్చిన బోయపాటి ?
X
ఎంత రొటీన్ మాస్ మసాలా సినిమా తీసినా ఫైనల్ గా ఏదోలా పాస్ అవుతూ వచ్చిన దర్శకుడు బోయపాటి శీనుకి వినయ విధేయ రామ పెద్ద షాకే ఇచ్చింది. ఇంత కన్నా పెద్ద డిజాస్టర్లు ఇచ్చిన డైరెక్టర్లు పడని నిందలు తాను మోయాల్సి వచ్చింది. అఫ్ కోర్స్ అంత నాసిరకంగా తీసి ఇదే మాస్ సినిమా అనుకోమంటే ప్రేక్షకులు తిరస్కరించకుండా ఉంటారా. ఎంత లేదనుకున్నా దీని ప్రభావం బోయపాటి డిమాండ్ మీద కాస్త గట్టిగానే పడింది. గతంలో అడ్వాన్సు ఇచ్చిన నిర్మాతలు వెనక్కు ఇమ్మని మెసేజులు పెట్టారట. పైగా దానయ్యతో జరిగిన గొడవ గురించి ప్రచారం బాగా జరగడం శీనుని మరోరకంగా ఇబ్బంది పెట్టింది.

ప్రస్తుతం బాలకృష్ణతో సినిమా కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్న బోయపాటి శీను నిజానికిది మైత్రి బ్యానర్ లో చేయాలి. అయితే బాలయ్య తన ఎన్బికే ఫిలిమ్స్ మీద ఇది చేద్దామని ముందే చెప్పడంతో మైత్రి తనకు ముట్టజెప్పిన సొమ్ము వెనక్కు ఇచ్చాడని ఫిలిం నగర్ టాక్. అంటే మైత్రి కూడా బోయపాటి శీనుతో తర్వాతైనా చేసే ఆసక్తి లేదని తేలిపోయింది. ఇదే వరసలో మరో ఇద్దరు ముగ్గురు ఉన్నట్టు సమాచారం. ఒకేసారి అందరికి ఇవ్వడం కష్టం కాబట్టి కాస్త టైం అడిగినట్టు తెలిసింది.

ఒకపక్క ఎన్టీఆర్ రెండు భాగాల డిజాస్టర్స్ తో మూడీగా ఉన్న బాలయ్యను ఒప్పించేందుకు శీను పవర్ ఫుల్ స్క్రిప్ట్ రాసుకోవడంలో బిజీగా ఉన్నాడు. ఈసారి బడ్జెట్ కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి ఆ నిబంధన మీద అనవరమైన లొకేషన్లు అవసరం లేని యాక్షన్ సీన్లు లేకుండా బిగుతైన స్క్రీన్ ప్లే కోసం టీంతో కలిసి డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. అవును మరి. ఇది తనకూ బాలయ్యకు సవాల్ విసురుతున్న ప్రాజెక్ట్. గత కొన్నేళ్ళలో బాలయ్యకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చింది బోయపాటి శీను ఒక్కడే. సింహ లెజెండ్ ల తర్వాత రిపీట్ అవుతున్న కాంబో కాబట్టి అభిమానుల అంచనాలు కూడా కాస్త ఎక్కువగానే ఉంటాయి