Begin typing your search above and press return to search.
అందాల 'ఉప్పెన' పిల్లను అందుకోవడం కష్టమే!
By: Tupaki Desk | 11 Sep 2021 3:31 AMఈ మధ్య కాలంలో తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో కృతి శెట్టి పేరు ప్రధమంగా వినిపిస్తుంది .. ప్రధానంగా కనిపిస్తుంది. 'ఉప్పెన' సినిమాతో పరిచయమైన ఈ అమ్మాయి కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసేసింది. బంగినపండు మామిడిపండువంటి ఈ అమ్మాయిని చూసిన పిలగాళ్లెవరూ, ఆ సినిమాను తీసేసేంతవరకూ థియేటర్లను వదిలిపెట్టలేదు. 'జల జల జలపాతం నువ్వు' పాట చూసిన తరువాత, కలలో ఆ అమ్మాయితో పడవ ప్రయాణం చేస్తూనే ఉన్నారు. అంతగా కృతి పడుచు మనసులను ప్రభావితం చేసింది.
పాలపిండిలో .. దానిమ్మ రసం కలిపి చేసినట్టుగా కనిపించే ఈ అమ్మాయి కుర్రాళ్ల ఊహా సుందరిగా మారిపోయింది. సమ్మోహనమైన ఆమె నవ్వు చూస్తే సగం ఎనర్జీ వచ్చేస్తుందనేది వాళ్లు చెబుతున్న మాట. మున్ముందు ఈ బ్యూటీ డేట్లు దొరకడం కష్టమని, ఫస్టు సినిమా ఫంక్షన్ లోనే మెగాస్టార్ చెప్పారు. అన్నట్టుగానే ఇప్పుడు కృతి శెట్టి డేట్లు దొరకడం కష్టంగా మారిపోయింది. ఈ సుందరి తమ సినిమా ఒప్పుకుంటే చాలు తమ సినిమా సగం సక్సెస్ అయిపోయినట్టేనని యంగ్ హీరోలు భావిస్తున్నారు.
కృతి శెట్టి అందమైనదే కాదు .. తెలివైనదనే విషయం కూడా ఆమె ఎంచుకునే సినిమాలను బట్టి అర్థమవుతోంది. తొలి సినిమా కొత్త హీరోతో చేసినా, ఆ సినిమా వెనక సుకుమార్ ఉన్నాడు .. మెగా ఫ్యామిలీ ఉంది అనే విషయాన్ని మరిచిపోకూడదు. ఇక ఆ తరువాత ఆమె సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సుధీర్ బాబు సరసన చేయడానికి అంగీకరించింది. ఆయనతో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా చేస్తోంది. ఇక నాని స్టార్ డమ్ గురించి తెలుసును గనుక, ఎలాంటి సందేహం లేకుండా 'శ్యామ్ సింగ రాయ్' సినిమాను పూర్తి చేసింది.
ఇక ఇదే ఊపులో ఆమె రామ్ - లింగుసామి సినిమాను, 'బంగార్రాజు'లో చైతూ జోడీగాను చేయడానికి అంగీకరించింది. తాజాగా నితిన్ ప్రాజెక్టులోను మెరిసింది. నితిన్ సొంత బ్యానర్లో నిర్మితమవుతున్న 'మాచర్ల నిజయోజకవర్గం' సినిమాలో ఆమె నటిస్తోంది. ఇక అల్లు అర్జున్ తదుపరి సినిమా కోసం .. చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ సినిమా కోసం ఈ అమ్మాయిని తీసుకోవాలనే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. అందులో వాస్తవమెంతన్నది తెలియాల్సి ఉంది. గ్లామర్ పరంగా .. నటన పరంగా .. క్రేజ్ పరంగా .. అవకాశాల పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోతున్న ఈ బ్యూటీని అందుకోవడం, మిగతా కుర్ర హీరోయిన్లకు కష్టమేనేమో!