Begin typing your search above and press return to search.
అమ్మాయిల కోసమే డ్రగ్స్ అలవాటు చేసుకున్న స్టార్ హీరో
By: Tupaki Desk | 17 April 2022 11:30 PM GMTబాలీవుడ్ స్టార్ హీరో, కేజీఎఫ్2లో విలన్ గా చేసిన సంజయ్ దత్ హాట్ కామెంట్స్ చేశారు. 1981లో రాకీ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సంజయ్ దత్ బాలీవుడ్ లో అంచలంచెలుగా ఎదిగి దేశవ్యాప్తంగా స్టార్ హీరోగా మారారు. ప్రస్తుతం నటుడిగా..సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. ప్రతినాయకుడిగా కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా సంజయ్ దత్ నటించిన చిత్రం 'కేజీఎఫ్2'లో భీకర విలన్ గా అలరించాడు.
సంజయ్ దత్ కెరీర్ ప్రారంభంలో తీవ్రంగా డ్రగ్స్ కు బానిస అయ్యాడన్న సంగతి తెలిసిందే.. దాని కారణంగా అతడు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఎట్టకేలకు ఆ డ్రగ్స్ కు దూరమై బతికి బయటపడ్డాడు. ఈ తరుణంలోనే నాటి అనుభవాల గురించి సంజయ్ దత్ పంచుకున్నారు. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
సంజయ్ దత్ మాట్లాడుతూ..'అప్పట్లో నాకు అమ్మాయిలతో మాట్లాడాలంటే చాలా సిగ్గు.. మరోవైపు వాళ్లకు నచ్చేలా ఉండడానికి ప్రయత్నించేవాడిని. దాని కోసం డ్రగ్స్ వాడితే వారికి కూల్ గా కనిపించడమే కాకుండా.. వారితో సులువుగా మాట్లాడే అవకాశం ఉంటుందని భావించా.. అందుకే డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టా' అంటూ చెప్పుకొచ్చాడు.
అనంతరం ఈ అలవాటు నుంచి బయటపడాలని ప్రయత్నించిన సంజయ్ రిహబిలిటేషన్ సెంటర్ కు వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో, బయట జనాలు ఆయన్ని డ్రగ్గీ అని పిలిచేవాడట.. దీని గురించి సంజయ్ మాట్లాడారు.
'రిహబిలిటేషన్ సెంటర్ నుంచి వచ్చిన తర్వాత అందరూ నన్ను డ్రగ్గీ అనేవారు. ఆ మచ్చని పొగొట్టుకోవడానికి ఏదో చేయాలని భావించా.. అందుకే చాలా కష్టపడి బాడీని బిల్డ్ చేసుకున్నానని.. అప్పటి నుంచి అందరూ నన్ను మెచ్చుకున్నారని సంజయ్ దత్ పాత విషయాలు పంచుకున్నారు.