Begin typing your search above and press return to search.
వాట్సాప్ చాట్ లో బుక్కయ్యాడు.. నటి పోలీస్ కేస్!
By: Tupaki Desk | 4 May 2020 3:30 AM GMTవాట్సాప్ చాట్ లో మాటా మాటా పెరిగింది. అటుపై అపార్థాలు చోటు చేసుకున్నాయి. గ్రూప్ సభ్యులంతా వీక్షించే ఈ వేదికపై ఆ ఇద్దరి మధ్యా ఈగోలు బయటపడ్డాయి. అప్పటికే సదరు నటికి ఈగో హర్ట్ అయ్యి భగభగ మండింది. వెంటనే సాటి నటుడు అని చూడకుండా అతడిపై పోలీస్ కేసు ఫైల్ చేసేందుకు సిద్ధమైంది. ఈ గొడవంతా ఎక్కడ? ఇందులో ఆర్టిస్టులు ఎవరెవరు? అంటే.. ఆ ఇద్దరి పేర్లు రంజని.. వాసు దేవన్..
ఈ ఇరువురు ప్రఖ్యాత నడిగర సంఘంలో జీవితకాల సభ్యులే. వాసుదేవన్ డ్రామా ఆర్టిస్టు. నటి రంజని అటు తమిళులతో పాటు ఇటు తెలుగు వారికి సుపరిచితం. అప్పట్లో ఆగస్టు 15 రాత్రి అనే తెలుగు సినిమాలో నటించారు. పలు తమిళ చిత్రాల అనువాదాలతోనూ రంజని ఇక్కడివారికి తెలుసు. ప్రస్తుతం వెటరన్ నటిగా తమిళం మలయాళంలో నటిస్తున్నారు. పలు టీవీ షోలకు జడ్జిగానూ కొనసాగుతున్నారు. అసలింతకీ డ్రామా ఆర్టిస్టు వాసుదేవన్ తో గొడవేంటి? అంటే...
ప్రస్తుత లాక్ డౌన్ వేళ వాసుదేవన్ తన స్వస్థలమైన తిరువన్నమలైలో పేద ఆర్టిస్టులకు చేసిన సహాయం వివరాలను నడిగర సంఘం గ్రూప్ లో పోస్ట్ చేశారు. ఆ వెంటనే `ఆయన ఎవరు?` అని అడిగారు రంజని. అతను నటుడు కాదేమో? అనే సందేహం వ్యక్తం చేశారు. దానికి అతడు అంతే యారొగెంట్ గా రిప్లయ్ ఇచ్చాడు. ``నేను నటుడిని.. కానీ మీ వృత్తి డిఫరెంట్`` అని సమాధానం ఇచ్చారు. `వృత్తి` అని నొక్కి చెబుతూ ఆయన విసిరిన వ్యంగ్య పదం రంజని ఈగోని హర్ట్ చేసింది. తప్పుడు అర్థం స్ఫురించేలా ఉందని సీరియస్ అయిన రంజని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అయితే తాను తప్పుడు అర్థం ధ్వనించేలా మాట్లాడ లేదని వాసుదేవన్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.``నేను డ్రామా యాక్టర్.. నువ్వు సినిమా నటి.. మన వృత్తులు రెండూ వేరు`` అనే అర్థంలో చాటింగు లో రాశారు. గొడవ ముదిరిపాకాన పడడంతో మధ్యలో సీనియర్ నటీనటులు మనోబాలా .. కుట్టి పద్మిని సహా సంఘంలోని పలువురు ఆ ఇద్దరికీ సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఎవరూ ఎవరి మాటా వినలేదు సరికదా పంతానికి పోయి పోలీస్ కేసులు అంటూ గడబిడ చేశారు. వెటరన్ నటి రంజని కేరళలో స్థిరపడ్డారు. అక్కడ పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. తమిళంలోనూ చెప్పుకోదగ్గ సినిమాలు చేశారు.