Begin typing your search above and press return to search.

కొడుకు మరణంతో శోకసంద్రమైన అలనాటి నటి!

By:  Tupaki Desk   |   23 May 2020 7:50 AM GMT
కొడుకు మరణంతో శోకసంద్రమైన అలనాటి నటి!
X
తెలుగు చిత్రసీమను ఏలిన సీనియర్ నటి వాణిశ్రీ ఇంట్లో నేడు విషాద వాతావరణం నెలకొంది. వాణిశ్రీ కుమారుడు డాక్టర్ అభినయ్‌ వెంకటేశ్‌ కన్నుమూశాడు. చెన్నైలోని తన నివాసంలో ఈరోజు తెల్లవారుజామున నిద్రలో ఉన్నప్పుడు గుండెపోటు రావడంతో అభినయ్‌ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. చెన్నైలోని అన్నపూర్ణ మెడికల్‌ కాలేజీలో మెడిసిన్‌ పూర్తి చేసిన అభినయ్ కు భార్య, కుమారుడు ఉన్నారు. అభినయ్ భార్య కూడా డాక్టరే. కొడుకు అకాల మరణాన్ని వాణిశ్రీ తట్టుకోలేకపోతున్నారు. ఆమె శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రస్తుతం ఆమె వయసు 71 ఏళ్లు. వాణిశ్రీకి ఓ కొడుకు, కూతురు. వాణిశ్రీ కుమారుడు సడన్ మరణంతో సినీఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. నటి వాణిశ్రీ కుటుంబానికి సినీ ప్రముఖులు అందరూ కూడా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

ఈరోజే అభినయ్ అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు చెప్పారు. గత కొన్నేళ్లుగా సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న వాణిశ్రీ తీవ్ర విషాదంతో కృంగిపోతున్నారు. వాణిశ్రీ కొడుకు డాక్టర్ అభినయ్ వెంకటేష్ గుండెపోటుతో మరణించడంతో ఇండస్ట్రీ వర్గాలతో పాటు బంధువులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కొన్నాళ్లుగా కుటుంబ సభ్యులతో కలిసి వాణిశ్రీ చెన్నైలోనే ఉంటున్నారు. వాణిశ్రీ కొడుకు అభినయ్ వెంకటేష్ చెన్నైలోని అన్నపూర్ణ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదువు పూర్తిచేసి వైద్య సేవచేస్తున్నారు. శుక్రవారం రాత్రి అభినయ్ వెంకటేష్‌కు నిద్రలో గుండెపోటు వచ్చినట్లు తెలిపారు. కరోనా కాలంలో వాణిశ్రీ ఇంట ఇలాంటి విషాద ఛాయలు.. నెలకొనడంతో పలువురు తమ సంతాపం తెలుపుతున్నారు. కాగా ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారట.