Begin typing your search above and press return to search.
కొత్త సినిమా షురూ చేస్తా: సీనియర్ డైరెక్టర్
By: Tupaki Desk | 29 May 2020 9:30 AM GMTతెలుగు ఇండస్ట్రీలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు ఎంతో ప్రత్యేకతను కలిగి ఉన్నారు. ఆయన సినిమాలతో తెలుగు రాష్ట్రాల కోట్ల సినీప్రియులందరిని ఎన్నో యేళ్లు అలరించారు. తెలుగు ఇండస్ట్రీ ఆయనను దర్శకేంద్రుడు అని కూడా పిలుచుకుంటుంది. ఆయన సినిమాల్లో చేయని హీరో లేడు.. ఆడిపాడని హీరోయిన్ లేదు. దర్శకేంద్రుడి సినిమా అంటే ప్రేక్షకులలో ఓ రేంజ్ అంచనాలు ఉంటాయి. కానీ ఆయన సినిమాలలో అందరికి కావాల్సినవి సమపాళ్లలో అందిస్తారు. తియ్యని ఫ్రూట్స్ తో సహా.. ఇక గత కొంతకాలంగా దర్శకేంద్రుడు దర్శకత్వ బాధ్యతలకు దూరంగా ఉన్నారు. ఆయన కెరీర్లో ఎప్పుడో తన 100 సినిమాల రికార్డు బ్రేక్ చేశారు. వంద సినిమాలకు పైనే దర్శకత్వం వహించారు. రాఘవేంద్రరావు చివరిగా అక్కినేని నాగార్జున హీరోగా 2017లో 'ఓం నమో వేంకటేశాయ' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత మళ్లీ ఆయన నుండి ఏ వార్త లేదు. అలా రెండేళ్ళకు పైగా దర్శకత్వానికి దూరంగా ఉండటం ఆయన కెరీర్లోనే మొదటిసారి.
ఇక ఎప్పటినుండో ఎదురుచూస్తున్న రాఘవేంద్రరావు కొత్త సినిమా కబురు ఆయనే ప్రకటించారు. అన్నగారు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా రాఘవేంద్రరావు ట్విట్టర్ ద్వారా తన కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన చేశారు. "నా యాభై ఏళ్ళ సినీ జీవితంలో అన్నగారితో ప్రయాణం ఎన్నటికీ మరువలేనిది. నా గత జన్మల సుకృతంగా భావిస్తాను. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా నా తదుపరి చిత్రాన్ని ప్రకటించడం ఆనందంగా ఉంది. నా కెరీర్లో ఈ సినిమా ఎంతో ప్రత్యేకంగా నిలవనుంది. ఇక పై మరింత కొత్తగా ప్రయత్నించ బోతున్నాను. ఈ సందర్భంగా సినిమా కాన్సెప్ట్ తో ఓ పోస్టర్ ని విడుదల చేశారు. ‘ముగ్గురు దర్శకులతో, ముగ్గురు హీరోయిన్స్‌తో దర్శకేంద్రుడి సినిమా. హీరో?’ అనే క్యాప్షన్ కూడా రాసుంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తా.." అంటూ ట్వీట్ చేశారు. ఈ వార్త తెలిసిన తెలుగు సినీప్రియులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దర్శకేంద్రుడి సినిమా అంటే అందరి దాహం తీర్చేస్తది.. అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.