Begin typing your search above and press return to search.
సీనియర్ నటికి 40 ఏళ్ల నాటి బాకీ తీర్చిన నిర్మాత
By: Tupaki Desk | 18 Oct 2019 1:21 PM GMTసినిమాలు మాత్రమే కాదు.. సదరు సినిమాలు నిర్మించే సమయంలో చోటు చేసుకునే విషయాలే కాదు.. సినీ పరిశ్రమకు చెందిన విషయాలు ఎంతో ఆసక్తకిరంగా ఉంటాయి. ఇప్పుడు చెప్పబోయేది అలాంటిదే. అప్పుడెప్పుడో తాను నిర్మాతగా వ్యవహరించి తీసిన సినిమాకు ఇవ్వాల్సిన పారితోషికం ఒక నటికి ఇవ్వలేకపోయానన్న బాధతో ఉన్న సీనియర్ నిర్మాత ఒకరు.. తాజాగా అప్పటి బాకీని ఇప్పుడు తీర్చిన వైనం ఆసక్తికరంగా మారింది.
ఇంతకీ సదరు నిర్మాత బాకీ పడిన సీనియర్ నటి ఎవరో కాదు.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉర్వశిగా పిలుచుకునే శారద. సినిమాటిక్ గా ఉన్న ఈ ఉదంతంలోకి వెళితే.. 40 ఏళ్ల క్రితం అంటే 1979లో పుష్యరాగం అనే మలయాళ సినిమాను నిర్మిస్తున్నారు నిర్మాత ఆంటోని. మధు.. జయన్..శారద.. శ్రీవిద్య ప్రధాన పాత్రల్లో పోసించారు. సినిమా తీసే సమయంలో తనకు ఎదురైన ఆర్థిక ఇబ్బందుల కారణంగా శారదకు పూర్తి పారితోషికాన్ని ఇవ్వలేకపోయారు ఆంటోనీ.
ఆ తర్వాత ఆయన తీసిన రెండు సినిమాలు కూడా ఆర్థికంగా లాభాలు సాధించలేదు. కాలగర్భంలో నలభై సంవత్సరాలు గడిచిపోయాయి. పడిన కష్టానికి తగ్గట్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఆంటోనీ ఇప్పుడు కోలుకోవటమే కాదు.. బాగానే సెటిల్ అయ్యారు. కానీ.. అప్పుడెప్పుడో తాను శారదకు బాకీ ఉన్న పారితోషికం గురించి మాత్రం మనసులో మెదులుతూనే ఉంది.
తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొనటం కోసం శారద కేరళ వస్తున్నట్లు తెలుసుకున్నారు. ఆ కార్యక్రమానికి వెళ్లిన ఆయన్ను శారద గుర్తుపట్టారు. తనతో సినిమా తీసిన నిర్మాతను ఆమె అప్యాయంగా పలుకరించారు. మాటల మధ్యలో తాను బాకీ ఉన్న పారితోషికం గురించి ప్రస్తావించిన ఆంటోనీ.. ఆమె చేతిలో కవరు పెట్టారు. దీనికి ఆశ్చర్యపోయారు శారద. అప్పుడెప్పుడో ఇవ్వాల్సిన పారితోషికం కోసం తపించిన నిర్మాత ఆంటోనీ ఉదంతం నేటి చిత్రపరిశ్రమకు ఒక చక్కటి ఉదాహరణ కావాలి. ఈ ఉదంతం ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు..వైరల్ గా మారింది.