Begin typing your search above and press return to search.
30 కోట్లు దుర్వినియోగం కాలేదు!
By: Tupaki Desk | 17 March 2022 1:30 PM GMTఆంధ్ర ప్రదేశ్ విభజన తరువాత నవ్యాంధ్ర ప్రదేశ్ లోనూ చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని అప్పటి ప్రభుత్వం, సినీ పెద్దలు భావించారు. ఇందు కోసం వైజాగ్ ని కేంద్రంగా ఎంచుకున్నారు. అపక్పటికే అక్కడ డి. రామానాయుడు ఫిలిం స్టూడియో నిర్మించారు.
ఈ నేపథ్యంలో అక్కడ కూడా ఓ ఫిలిమ్ కల్చరల్ క్లబ్ అవసరమని ఇండస్ట్రీ వర్గాలు భావించాయి. విశాఖ ఫిలిమ్ నగర్ కల్చరల్ సెంటర్ ను అక్కడ వున్న ఔత్సాహికుల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో స్థాపించారు. ఈ క్లబ్ కి అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావుని నిమమించారు.
గత ఐదేళ్లుగా ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే బుధవారం ఓ దిన పత్రికలో వైజాగ్ కల్చరల్ క్లబ్ ని రద్దు చేసి వైసీపీకి సంబంధించిన ముగ్గురు పెద్దలకు సదరు క్లబ్ ని అప్పగించారని ఓ వార్త ప్రచురితమైంది. అంతే కాకుండా ఇందులో వున్న 30 కోట్ల రూపాయలు కూడా మాయమయ్యాయిని అందులో తెలిపారు.
దీనిపై గురువారం ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎవరో గిట్టనివారు తెలిపిన వివరాలని పరిగణలోకి తీసుకుని ఇలాంటి వార్తల్ని ప్రచురించడం సరికాదన్నారు. తనని అధ్యక్షుడిగా తొలగించారని, క్లబ్ ఆధీనంలో వున్న 30 కోట్ల కూడా దుర్వినియోగం అయ్యాయనడం పూర్తిగా అవాస్తం అని ఆయన కొట్టి పారేశారు.
సరైన అవగాహణ లేని వారే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి వుంటారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఎఫ్ ఎన్ సీసీ క్లబ్ కోసం గత ప్రభుత్వం రెండు చోట్ల స్థలాలని కేటాయించిందని, తొలుత తొట్ల కొండలో స్థలం కేటాయిస్తే అక్కడ శంకుస్థాపన చేశామని, అయితే అది బౌద్ద ఆరామ పర్యటక ప్రదేశం కావడంతో బౌద్ధులు అభ్యంతరాలు తెలిపారని, దీంతో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డి. రామానాయుడు స్టూడియోస్ సమీపంలో ఐదెకరాల స్థలాన్ని కేటాయించారని, ఇప్పటికీ ఈ రెండు సైట్ లు ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ పేరు మీదే వున్నాయని తెలిపారు.
అయితే అవి నిర్మాణానికి అనువుగా ఇంకా మజూరు కాకపోవడంతో ఓ మిత్రుడు బీచ్ సమీపంలోని తన స్థలంలో కల్చరల్ క్లబ్ కు అనుమతినిచ్చారని, అక్కడే ప్రస్తుతం విశాఖ పట్టణం ఫిలిమ్ కల్చరల్ క్లబ్ కొనసాగుతోంది అన్నారు కె.ఎస్. రామారావు. నిజానికి వయసు రీత్యా తన పదవికి సరైన న్యాయం చేయలేకపోతున్నానని, తానే ఆ పదవి నుంచి తొలగాలని చాలా రోజులుగా భావిస్తున్నానని తెలిపారు. అయితే అక్కడి మిత్రులు అందుకు అంగీకరించకపోవడం వల్లే పదవిలో కొనసాగుతున్నానన్నారు.
ఏపీ ప్రభుత్వం తీసుకున్న టికెట్ రేట్ల నిర్ణయంపై స్పందిస్తూ .. టికెట్ రేట్ల విషయంలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంది. బడ్జెట్ ప్రకారం టికెట్ రేట్లు పెంపు వంటి అంశాలని పరిశీలిస్తోందన్నారు.