Begin typing your search above and press return to search.

సూపర్ హిట్‌ మూవీ సీక్వెల్‌ పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌

By:  Tupaki Desk   |   28 Jun 2023 9:00 AM GMT
సూపర్ హిట్‌ మూవీ సీక్వెల్‌ పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌
X
తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ సూపర్‌ హిట్ చిత్రాల్లో 'వడ చెన్నై' సినిమా చాలా ప్రత్యేకమైనది అనడంలో సందేహం లేదు. విలక్షణ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో ఆ సినిమా వచ్చింది. 2018 సంవత్సరంలో వడ చెన్నై సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. గత రెండు సంవత్సరాలుగా వడ చెన్నై కి సీక్వెల్ గురించి వార్తలు వస్తున్నాయి.

దర్శకుడు వెట్రిమారన్ స్క్రిప్ట్‌ రెడీ చేస్తే తాను రెడీ అన్నట్లుగా హీరో ధనుష్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. దాంతో కచ్చితంగా సీక్వెల్‌ ఉంటుందని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఈ సమయంలోనే దర్శకుడు సీక్వెల్‌ పై ఫుల్ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు.

ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వెట్రిమారన్ మాట్లాడుతూ.. వడ చెన్నై సినిమా సీక్వెల్ కోసం స్క్రిప్ట్ రెడీగా ఉంది. త్వరలోనే సినిమా ను మొదలు పెడతాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. సీక్వెల్‌ కచ్చితంగా ఉంటుందని వెట్రిమారన్ క్లారిటీ ఇవ్వడంతో ధనుష్ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నారు.

ఇటీవల విడుదల అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెట్రిమారన్‌ ప్రస్తుతం ఆ సినిమా రెండవ పార్ట్‌ కోసం వర్క్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా తమిళ స్టార్‌ హీరో సూర్య తో ఆజన్బీ పుస్తకం ఆధారంగా ఒక సినిమాను చేయాలని కూడా భావిస్తున్నట్లుగా ఈ విలక్షణ దర్శకుడు పేర్కొన్నాడు.

వెట్రిమారన్‌ వరుసగా తమిళ సినిమాలకు మరియు స్టార్‌ హీరోలతో కమిట్ అయ్యి ఉన్నాడు. అయినా కూడా తెలుగు లో ఆయన సినిమా ఉంటుందని... స్టార్‌ హీరోలు ఆయనతో వర్క్‌ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య వెట్రిమారన్ తెలుగు లో తప్పకుండా సినిమా చేస్తాను అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. ఎన్టీఆర్ తో వెట్రిమారన్‌ సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి.